విజయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
విజయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
_ ప్రత్యేక అలంకారంలో రామచంద్ర స్వామి
_ భక్త జన సందేహం నడుమ సూర్యనారాయణ భగవాన్ కి పాయస నివేదన
సూర్యాపేట,ఫిబ్రవరి 04:స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి పర్వదినం పురస్కరించుకొని ఆలయ అర్చకులు మరింగంటి వరదా చార్యులు రామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో రామచంద్ర స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి ఆరాధన ఆదిత్య హృదయ పారాయణం అష్టోత్తరం శతనామావళి తదుపరి ప్రత్యక్ష దైవం సూర్యనారాయ స్వామికి చిక్కుడు ఆకులలో పాయస నివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ... రథ సప్తమి రోజున ప్రత్యక్ష దైవం అయిన శ్రీ సూర్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పాయస నివేదన చేస్తే దీర్ఘ కాలిక గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు దరి చేరవని తెలిపారు.ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారం విశేష పూజలు అభిషేకాలు ఆకు పూజలు నిర్వహిస్తామని భక్తులు స్వామి వారిని దర్శించి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ మండల రెడ్డి వెంకట రెడ్డి కార్యదర్శి నాగవేల్లి దశరథ, అంజన్ రెడ్డి ,రామారావు,వెంకన్న మరియు మహిళా భక్తులు సారిక ,రంగమణి,బాల నాగమ్మ,మంజుల, ఉపేంద్ర ,మాధవి, శ్రీలత, శ్రీదేవి ,రమణ, సరస్రిజ, రమాదేవి, లక్ష్మీ ,రజిత సుధాకర్, కల్పన, హిమ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.