పాస్టర్ దారావత్ సక్రం నాయక్ మృతి బాధాకరం

పార్దివా దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పాస్టర్స్

Jan 8, 2025 - 19:05
 0  2
పాస్టర్ దారావత్ సక్రం నాయక్ మృతి బాధాకరం
పాస్టర్ దారావత్ సక్రం నాయక్ మృతి బాధాకరం

సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుల బిషప్ డా దుర్గం ప్రభాకర్ నియోజకవర్గ అధ్యక్షులు : రెవ. డా. జలగం జేమ్స్  చివ్వేంల అధ్యక్షులు: రెవ. గుగులోతు బాలాజీ నాయక్  రీచ్ ఇండియా డైరెక్టర్: ధరవత్ లాకు నాయక్  బుధవారం 08 జనవరి స్థానిక చివ్వేంల మండల కేంద్రంలోని పాండ్య నాయక్ తండా నందు తన స్వగృహం నందు దారావత్ సక్రం నాయక్  గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ తన నివాసంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ప్రభు నందు నిద్రించ్చినారు. చివ్వేంల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ.గుగులోతు బాలాజీ నాయక్, రీచ్ ఇండియా వ్యవస్థాపకులు ధరవత్ లాకు రేణుక నాయక్,పాస్టర్స్ పెలోషిఫ్ సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ లు ఆధ్వర్యంలో వారి పార్ధివ దేహానికి పూల మాల వేసి ప్రార్ధించి నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బిషప్ డా. దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ కోటియా నాయక్ తండా, తాళ్ల సింగారం తాండలలో పరిచర్య చేస్తున్నారని,చివ్వేంల మండలం లో గతంలో పాస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గా పనిచేసారని,గొప్ప దైవజనులను కోల్పోయినమని బాధను వ్యక్తపరిచారు, వారు జిల్లా వ్యాప్తంగా 20 సంవత్సరాలుగా దేవుని పరిచర్య ఘనంగా చేశారని, తనకు భార్య ఇద్దరు కుమారులు వున్నారు ,భార్య అనసూర్య, పెద్ద కుమారుడు షాలేం నాయక్ (16) చిన్న కుమారుడు సాత్విక్ నాయక్ (13 ) అనీ అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం గౌరవ సలహాదారులు రెవ బొక్క ఏలీయా రాజు, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్, రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్,రెవ.బానోత్ సుధాకర్ నాయక్ , రెవ. డా. పంది మార్కు,పాస్టర్ వరికుప్పల మత్తయి,పాస్టర్ బి.మోతిలాల్ నాయక్ ,పాస్టర్ బి.లింగ నాయక్ , డి.సల్మాన్ లింగ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333