బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం 

Oct 22, 2024 - 18:01
 0  6
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం 
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం 

తుంగతుర్తి అక్టోబర్ 22 తెలంగాణ వార్త ప్రతినిధి అబ్బ గాని వేణు:- తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్   ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్ ఉపాధ్యాయులు ఫిరోజి  బదిలీ పై వెళ్లారు వారిని పిల్లలు  గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్  మాట్లాడుతూ నేను ఈ పాఠశాలకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది నేను మొదట ఈ పాఠశాలకు వచ్చినప్పుడు పిల్లల సంఖ్య 20 ఉండేది మేము వచ్చాక గ్రామంలో వీధి వీధి తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి బ్రతిమాలి వారికి భరోసా ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువు పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి 20 ఉన్న సంఖ్యను 53 వరకు తీసుకెళ్లాం పిల్లలు కూడా మాకు సహకరించి చాలా బాగా చదువుకొని అందులో 12 మంది గురుకులంలో సీటు సంపాదించుకున్నారు అందుకు మేము చాలా గర్వపడ్డం ఇక్కడ పిల్లలు కూడా మా సొంత పిల్లల్లాగా మాతో కలిసిమెలిసి ఉండేవారు వారిని వదిలిపెట్టి వెళ్లాలంటే మాకు ఇష్టం లేదు అని కన్నీళ్లు కారుచుకున్నారు గ్రామ పెద్దలు కూడా మాకు అన్ని రంగాల్లో సహకరించారు అని అన్నారు ఉపాధ్యాయులు ఫిరోజి మాట్లాడుతూ ఈ బడిని విడిచి వెళ్లడం మాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు పిల్లలను వదిలేసి వెళ్లాలంటే చాలా బాధాకరంగా ఉంది అని కన్నీళ్లు కార్చారు వీరి స్థానంలోకి నూతనంగా  డీఎస్సీ ఉత్తనులైన ప్రధానోపాధ్యాయులుగా లక్ష్మి ఉపాధ్యాయులుగా నాగు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మా ఊరికి వచ్చి మా స్కూలు బాగోగులు చూసుకొని మాలో ఒకరిగా కలిసిపోయిన ఈ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమని బాధతో కన్నీళ్లు కార్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వార్త రిపోర్టర్ అబ్బగాని వేణు సేవ యూత్ క్లబ్ అధ్యక్షులు పంజాల ప్రవీణ్ గుండ గాని సోమయ్య వీరబోయిన అంజి పూలపాక సుదర్శన్ గ్రామ మల్టీపర్పస్ వర్కర్స్ అక్కినపల్లి మల్లేష్ పంజాల హరీష్ పోలెపాక ముత్తయ్య పోలెపాక నగేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333