జిల్లా కలెక్టర్. & డిఎంహెచ్వో ను

Feb 25, 2026 - 19:43
 0  11
జిల్లా కలెక్టర్. & డిఎంహెచ్వో ను

ఐజ మున్సిపాలిటీ లోని *4 వార్డ్ ( SC కాలనీ )లో గల బస్తీ దావఖానా ను ప్రాంబించండి.*

        ..... MRPS ఐజ రాజు మాదిగ డిమాండ్ 

జోగులాంబ గద్వాల 25 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఐజ మున్సిపాలిటీ లోని 4వార్డ్ లో...
 
బస్తీ దావఖానా నిర్మాణంపూర్తి అయ్యి,

దాదాపు గా రెండు సంవత్సరాలు అయ్యింది!

ఇప్పటి వరకు అట్టి హాస్పటల్ ను ప్రారంభించక పోవడం చాలా దురదృష్ట కరం,

  లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి,అట్టి భవన నిర్మాణం చేపట్టి,

 దానిని నిరూపయోగంగా వదిలి వెయ్యడం ఎంత వరకు సమంజసం,

   అట్టి దావఖానా ప్రారంబిస్తే..... మా యొక్క SC కాలనీ ప్రజలకు చాలా ఉపయోగ కరంగా ఉంటుంది,

  ఎందుకంటే.... ప్రతీ చిన్న, చిన్న, ఆరోగ్య సమస్యలు ఏమి వచ్చిన,మా కాలనీ వాసులు ఐజ పట్టణ పరిధిలో గల ప్రభుత్వ దావఖానా కు వెళ్ళాలంటే 

దాదాపు గా లోకల్ ఆటో లకు ఒక్కోరికి 50 నుండి 60 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి!

దీనితో... రెక్కడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్ట పోతున్నారు,

కనీసం... బస్తీ దావఖానైనా త్వరగా ప్రారంబిస్తే చాలా వరకు SC కాలనీ ప్రజల కు చాలా ఉపయోగ కరంగా ఉంటుంది,

  కావున మా పై దయవుంచి జిల్లా కలెక్టర్  & DM &HO ఇట్టి విషయం పై దృష్టి సారించి, 

తక్షణమే 4 వార్డ్ లోని బస్తీ దావఖానా ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని నాల్గవ వార్డు ప్రజలం కోరుచున్నాము,

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333