మమ్ములను రోడ్డున పడవేయొద్దు!డీజే యజమానులు

ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి వినతి పత్రం అందచేయుత

Oct 6, 2024 - 15:28
Oct 6, 2024 - 15:29
 0  36
మమ్ములను రోడ్డున పడవేయొద్దు!డీజే యజమానులు
మమ్ములను రోడ్డున పడవేయొద్దు!డీజే యజమానులు

పాలకుర్తి 06 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- గౌరవనీయులైన పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేకి నమస్కరించి వ్రాయునది ఏమనగా!విషయం:వరంగల్  కమిషనర్ రేటు పరిధిలోని డీజే వినియోగం పై విషయానుసారంగా రాయుచున్నది.పాలకుర్తి, కొడకండ్ల,దేవరుప్పుల మండలాల డిజె యూనియన్ సభ్యులు..గత కొద్ది సంవత్సరాలుగా మేము ఇదే డీజే సౌండ్స్ వత్తి పై ఆధారపడి జీవనాధారం చేస్తున్నాం.గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు డీజే వినియోగం పై నిషేధం వార్తలు వస్తున్న క్రమంలో డీజే వృత్తి పై ఆధారపడిన మా కుటుంబాలను పోషించుకుంటున్నాం.ఇప్పుడు రోడ్డుపైన పడటం జరుగుతుంది. ఆనాటి తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఈనాటి రాజకీయాల ప్రతి మీటింగ్ సమావేశాలకు కీలకంగా వ్యవహరిస్తున్న డీజే సౌండ్స్ నేడు  మూగబోతుంది.చిన్నచిన్న కార్యక్రమాలు మొదలుకొని మనిషి అంతిమ యాత్ర క్రియల వరకు మా సౌండ్ లేనిదే ఏ కార్యక్రమం జరగదు.కావున మాపై దయతలచి కొన్ని నియమ నిబంధనలతో కూడిన పరిమితులతో కూడిన అనుమతులు ఇవ్వగలరని మా యొక్క ప్రార్ధన పాలకుర్తి నియోజకవర్గం డీజే యూనియన్ సభ్యులుగా కోరుతున్నాం.