సోమవారము ప్రజావాణి రద్దు
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నందున 18వ తేదీన సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల్ జిల్లాలో రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు అందరూ గ్రూప్- 3 పరీక్షల నిర్వహణలో ఉంటారని అందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులు తీసుకొని దూర ప్రాంతాలను నుండి కలెక్టరేట్ కు వచ్చి అసౌకర్యానికి ఇబ్బంది పడకాకూడదని తెలిపారు