పారిశుద్ధ్య పనులను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

Jul 29, 2025 - 21:03
Jul 30, 2025 - 10:04
 0  32
పారిశుద్ధ్య పనులను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  పారిశుద్ధ్య పనులను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి  విధులకు సక్రమంగా రావడం లేదని , గ్రామ పంచాయతీ పనులపై నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు చెత్త వేసి గ్రామస్తుల నిరసన.. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య పనులు గత కొద్ది కాలంగా జరగకపోవడంతో గ్రామంలో చెత్త పేరుకుపోయిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేశారు. మన ఊరిలో కార్యదర్శి అంటే చాలామంది తెలియదని, ఎప్పుడు వస్తాడో తెలియదు గ్రామ పంచాయతీ సమస్యలు పట్టించుకోవడం నిర్లక్ష్యం ఇస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ కార్యదర్శిని పారిశుద్ధ్య పనుల గురించి అడిగితే నువ్వెక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటున్నాడనీ ఆరోపించారు.వాటర్ ప్లాంట్ మీద వచ్చిన డబ్బులతో చెత్త బండి నడపాల్సి ఉండగా గ్రామపంచాయతీ ట్రాక్టర్లు మెకానిక్ షెడ్ లో పెట్టి చెత్త బండి నడిపించడం లేదని ఆరోపించారు. గ్రామంలో వీధిలైట్లు లేవని, మురికి కాలువలు తీయక పోవడం తో దుర్వాసన వస్తుందని ఆరోపించారు.ఉన్నతాధికారులు స్పందించి గ్రామపంచాయతీ పారిశుధ్య పనులను  చేపట్టాలని విధులకు సక్రమంగా రాకుండా గ్రామపంచాయతీ పనులను పట్టించుకోకుండా ఉన్న పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమం లో మాజీ సర్పంచి మందడి శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ వంగేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ యానాల కృష్ణారెడ్డి,మాజీ వార్డు నెంబర్ కందాల లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బ వీరారెడ్డి, ముడుపు లక్ష్మారెడ్డి, సోమయ్య, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.