ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్.
జోగులాంబ గద్వాల 9 జులై 2024 తెలంగాణవార్త ప్రతినిధి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరోగ్య సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు . వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కై వచ్చిన రోగులను పలకరించారు.ఆసుపత్రి పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకబు చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరు సమయపాలన పాటించాలని, ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని, వంద శాంతం నార్మల్ డెలివరీలు చేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల కు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలాన్నారు.
అనంతరం ఫార్మసీ స్టోర్ పరిశీలించడం జరిగింది.ల్యాబ్ టెస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టాక్ రిజిస్టర్ మరియు సిజనల్ వ్యాధులకు సంబందించిన మందుల స్టాక్ ను పరిశీలించారు.
గ్రామాలలో ఎన్ సి డి కార్యక్రమం క్రింద 30 సంవత్సరాలకు పైబడిన వారిని గుర్తించి వారిలో లో బి.పి, షుగర్ లాంటి వ్యాధులను గుర్తించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషంట్ లకు స్వచ్ఛమైన త్రాగు నీటి సదుపాయాలు కల్పించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గ్యాని వెంకట్ రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనందయ్య , ఫార్మసిస్ట్ శ్రీహరి, ల్యాబ్ టెక్నీషియన్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.