ప్రజా దివాస్ లో బాగంగా  ప్రజల నుండి నుండి  ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

Jul 8, 2024 - 20:33
Jul 8, 2024 - 20:45
 0  10
ప్రజా దివాస్ లో బాగంగా  ప్రజల నుండి నుండి  ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 9 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి గద్వాల:-ప్రజలు  శాంతి భద్రతలకు సంబందించి ఏలాంటి పిర్యాదు చేసిన తక్షణమే పోలీస్ అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలకు  అవసరమైనపుడు క్షణాలలో వచ్చే పోలీసు స్పందనపైనే ప్రదానంగా దృష్ట సాదిస్తానని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు, IPS తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యలయం లో ఎస్పీ  స్వయంగా ప్రజదివాస్  నిర్వహించారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పిర్యాదుదారులు హాజరై సమస్యలను తెలియజేసి అర్జిలను సమర్పించారు, వారినీ అప్యాయంగా పలకరించి ఓపిగ్గా సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తగు ఆదేశాలు జారి చేయటం జరిగింది.

 అలాగే ప్రజ ఫిర్యాదుల గురించి జిల్లా పోలీస్ కార్యాలయం లో డి.ఎస్పీ,సర్కిల్ అధికారులతో చర్చించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదు పై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషను లకు వచ్చిన బాదితుల ఫిర్యాదుల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రిపోర్టు సబ్మిట్ చెయ్యాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఆదేశించారు. 

 ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ... ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులకు ప్రజలకు సంబంధాలు మెరుగుపరుస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని,  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

 ప్రజలకు గ్రామాలలో  అనుమాస్పదన వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిన , మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతున్నా లేదా రావణ చేస్తున్న,  వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు  సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ  ప్రజాలను కోరారు.

ఈ రోజు వచ్చిన 18 ఫిర్యాదులలో
 భూ వివాదాలకు సంబందించి -07 పిర్యాదులు.

భర్తల వేదింపులకు సంబందించి -0 2ఫిర్యాదులు.

ప్లాట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి -02 ఫిర్యాదులు .
ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిని తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్ళారు అని, పక్కింటి వ్యక్తి వేదింపులకు గురి చేస్తున్నాడు అని, పొలం ను కౌలు తీసుకున్నా వ్యక్తి పొలంలో ఇసుక తిశాడు ఆని, అప్పుగా తీసుకున్నా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు అని -ఒక్కొక్క ఫిర్యాదు -04(మొత్తం) ఫిర్యాదులు. ఇతర అంశాలకు సంబంధించి-04 పిర్యాదులు. అందాయని పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State