ప్రాణ‌పోయినా… పది మందికి జీవ‌న‌దానం

Jul 29, 2024 - 19:53
 0  2
ప్రాణ‌పోయినా… పది మందికి జీవ‌న‌దానం

హైద‌రాబాద్:-ఈ జీవకోటిలో మనిషి పుట్టుక ఒక అద్భుతం. అన్ని జీవులలో అత్యంత తెలివైనవాడు మనిషి. ప్రతి ఒక్కరూ ఈ జన్మలో ఏదైనా గొప్పగా చేసి పదిమందికి గుర్తుండిపోయేలా చేయాలని కోరుకుంటారు. వ్యక్తి చనిపోయిన తర్వాత 200 అవయవాలను దానం చేసి పది మంది ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న తమ కూతురు బ్రెయిన్ డెడ్‌తో హఠాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది.

మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక(16) నగరంలోని ఓ కళాశా లలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్చించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు. బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ఆ తల్లి దండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయ వాలు దానం చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఆ బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు. దీంతో ఆమె త‌ల్లిదండ్రుల ఔదార్యానికి వైద్య‌లు అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333