ప్రజావాణి కార్యక్రమంలో 10 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్

Sep 1, 2025 - 18:50
 0  11
ప్రజావాణి కార్యక్రమంలో 10 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్

 జోగులాంబ గద్వాల 1సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల ప్రజావాణిలో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి కృషి చెయ్యడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపిఎస్.,  అన్నారు. 
 
ఈరోజు నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 10 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..... ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

ఈ రోజు వచ్చిన పిర్యాదులలో 
కొడుకు తన తల్లిని చూసుకోక పోవడం- 01, భర్తల వేధింపులకు సంబందించి -02,
ప్లాట్ సంబందించి - 02,
భూ వివాదాలకు సంబందించి -02, గొడవలకు సంబందించి- 01, 
ఇతర అంశాలకు సంబంధించి -02 పిర్యాదులు రావడం జరిగిందని పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333