ఆషాడ మాస మహిళా గోరింటాకు పండగ

పెబ్బేరు, 26 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పెబ్బేరు మున్సిపాలిటీలో ఆషాడ మాసం సందర్బంగా పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఆర్య వైశ్య మహిళలు గోరింటాకు పండగ ను ఘనంగా జరుపుకొన్నారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళలు కవిత, రాధికా, నిర్మల, భార్గవి, గీత, సుమలత, లత, శ్రీలత, రమాదేవి, లక్ష్మి, సంధ్య, భాగ్యలక్ష్మి, అరుంధతి, అనిత తదితరులు పాల్గొన్నారు