కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ

మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ ఆర్థిక సాయంతో

Jul 13, 2024 - 19:06
Jul 13, 2024 - 20:11
 0  31
కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ

తుంగతుర్తి, 14 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా లో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం మరియు గాదరి కిశోర్ కుమార్ ఆర్థిక సహకారంతో మరో 100 మంది కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ ఇంచార్జి గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ .

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమ ప్రదాత మాజీ శాసన సభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ నియోజకవర్గ కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అసంఘాటీతం ఉన్న కార్మికులను సంఘాటీతం చేసిన ఘనత అయనదే , నిర్మాణ రంగం నమ్ముకున్న వందలాది కార్మికులకు తన సొంత ఖర్చులతో లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్స్ అందజేయటం జరిగింది. అందులో భాగంగా నే వారు అందించిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ల ప్రతిఫలం నేడు లబ్ధిదారులకు 9లక్షల ఆర్థిక సహాయం అందింది.నాడు కిశోరన్న సంక్షేమనికి వేసిన బాట నేడు లబ్ధిదారులకు బాసట,అదే విధంగా రోడ్డు ప్రమాదం లో మరణించిన నలుగురు డ్రైవర్స్ కుటుంబాలకు అతి త్వరలో ఒక్కొక్కరికి 5లక్షలు చొప్పున 20 లక్షలు అందజేస్తమని అన్నారు,రోడ్డు ప్రమాదంలో మరణించిన మరో ముగ్గురు నిర్మాణ రంగ కార్మికులకు 18.9 లక్షల రూపాయలు అతి త్వరలో అందజేస్తామని అన్నారు.కార్మికులందరికి ఎల్లవేళలా కిశోర్ అన్న సహాయ సహకారాలు ఉంటాయని ఉన్నారు. అనంతరం పెండింగ్ ఉన్న లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కిశోరన్న  ఆర్థిక సహకారంతో ఈ రోజు కార్మికులకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ మండల ఉపాధ్యక్షులు కూరపాటి సోమేశ్, గుగులోత్ ఈరు నాయక్, గుగులోతు రవి, రాజేష్, వెంకన్న కొండగడుపులజయమ్మ,ముత్తయ్య,రమణమ్మ, సుజాత అభినవ్ రామచంద్రు కార్మికులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333