ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచుటకు చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి 

Apr 7, 2024 - 20:19
 0  7
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచుటకు చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట :- తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచుటకు ప్రభుత్వము, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఆదివారం టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నన్నెబోయిన సోమయ్య అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుటకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో ప్రతి సంవత్సరము విద్యార్థుల సంఖ్య నమోదు తగ్గి పోతున్నదని, రాబోయే కొన్ని సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో నమోదయ్యే విద్యార్థుల సంఖ్య జీరో స్థాయికి వచ్చే ప్రమాదం  ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచుటకు ఉపాధ్యాయులు ,ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వము ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలో 2023- 24 డైస్ గణాంకాల ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో 23000 కాగా, ప్రవేట్ పాఠశాలలో 36వేల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ ఆందోళనకరంగా పడిపోతున్నదని, ప్రస్తుతం ఉన్న వసతులు, టీచర్లతోనే ఎన్రోల్మెంట్ పెంచుకునే అవకాశాలను ఆలోచించాలని, ప్రాథమిక పాఠశాలలో తరగతికి కనీస సంఖ్య ఉన్నప్పుడే విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియ మెరుగ్గా ఉంటుందని, ప్రతి తరగతికి కనీస సంఖ్య 15 ఉండాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో వంద మంది విద్యార్థులు ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి తరగతి ఒక గది, తరగతికి ఒక టీచర్, ప్రధానోపాధ్యాయుడు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ ను ప్రజల నుండి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు .ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను అవసరమున్న చోట ఉన్నత పాఠశాలలుగా అప్డేట్ చేయాలని, అవసరం లేని వాటిని,  ప్రాథమిక పాఠశాలలను డీగ్రేడ్ చేయాలని సూచించారు. 50 లోపు విద్యార్థులు ఉన్నత పాఠశాలల ఆవాస గ్రామంలో ఆరు నుంచి పది తరగతులు చదివే పిల్లల సంఖ్య 75 కి లోపు ఉండి మూడు కిలోమీటర్ల దూరంలో మరొక ఉన్నత పాఠశాల ఉన్నట్లయితే,  ఆ పాఠశాలల్ని కొనసాగించాలా లేదా ఆలోచించాలని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతామని తెలియచేశారు కానీ కొత్త పాఠశాలలు అవసరం లేదని, ఉన్నటువంటి పాఠశాలలను హేతుబద్ధీకరణ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ ,పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కే ఏ మంగ ,పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు ఆర్ ధనమూర్తి ,టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, కే అరుణ భారతి, జిల్లా కార్యదర్శులు ఆర్ దామోదర్, బి పాపిరెడ్డి, ఎన్ నాగేశ్వరరావు, వి రమేష్, ఎన్ సాంబయ్య, డి లాలు, ఆర్ శ్రీను వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రిన్సిపాల్ ఆఫీస్ బేరర్స్, సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333