ప్రపంచానికి వెలుగులను చూపించిన ధీరవనిత సావిత్రి బాయి పూలె
తెలంగాణ వార్త సూర్యపేట 3-1-26:
సమాజంలో ఉన్న విషమ పరిస్థితుల నుంచి ప్రపంచానికి వెలుగులను చూపించిన ధీరవనిత సావిత్రి బాయి పూలె అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశం మందిరంలో సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు చదువుకోవటం ద్వారా నేడు ఆటలలో రాణించటం తో పాటు,ప్రభుత్వ ఉద్యోగులుగా,ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ లుగా అవ్వటంతో పాటు అంతరిక్షంలోకి వెళ్లేలా తయారయ్యారని సమాజంలో పెను మార్పులు సృష్టించేలా నేడు మహిళలు ఉన్నత స్థానాలకి ఎదిగి మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు.
చదువుకోవటం ద్వారా వ్యక్తులు స్వతంత్రంగా జీవించేలా చేయటం తో పాటు, సమాజం లో స్థిర మార్పులు తీసుకొస్తుందని మహాత్మా జ్యోతి బాపూలే సావిత్రిబాయి పూలేకు స్వయంగా విద్యను నేర్పించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా తీర్చిదిద్దాడని అన్నారు.
సావిత్రిబాయి పూలే నాటి సామాజిక పరిస్థితులను అధిగమించి మహిళలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి చదువు నేర్పించి ఎందరో మహిళలను ఉన్నత స్థానాలకు చేర్చిందని నేను కూడా సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ పూణే నందు డిగ్రీ విద్యను అభ్యసించానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థులకు జ్ఞాన దీపాలను వెలిగించి మారుతున్న సాంకేతిక యుగంలో ప్రపంచ స్థాయికి పోటీపడెలా తయారు చేసి ఉన్నత స్థానాలకు చేరుకునేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
జిల్లా ఎస్పీ కే నరసింహ మాట్లాడుతూ మహిళలకు ఓపిక,సహనం ఎక్కువగా ఉంటుందని మహిళలు అని రంగాల్లో రాణిస్తూ సావిత్రిబాయి పూలే చూపిన మార్గంలో ప్రయాణిస్తూ విద్యార్థులు సరైన మార్గంలో క్రమశిక్షణతో ప్రవర్తించేలా సమాజంలో మార్పులు తెచ్చేలా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
అదనపు కలెక్టర్ కె సీతారామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను తెలుసుకొని ఆమెను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సావిత్రిబాయి పూలే మొదట చదువుకోలేదని, 10 సంవత్సరాలకే బాల్య వివాహం చేశారని,మహాత్మ జ్యోతిరావు బాపులే ఆమెకు అక్షర జ్ఞానం నేర్పించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారని తెలిపారు.
ఒక వ్యక్తికి చదువు నేర్పితే వెయ్యి మంది జీవితాలు వెలుగునివ్వచ్చని సావిత్రిబాయి పూలే నాటి పరిస్థితులను ఉక్కుసంకల్పంతో ఎదుర్కొని ముందుకెళ్లిందని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులను బలోపేతం చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అన్నారు.
అనంతరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రతిభ చూపెట్టిన జడ్.పి.హెచ్.ఎస్ ఏనుబాముల ఉపాధ్యాయురాలు పి ఝాన్సీ, జెడ్పిహెచ్ఎస్ చివ్వేంల ఉపాధ్యాయురాలు జే రమణ, పాలే అన్నారం ఎం పి పి ఎస్ ఉపాధ్యాయురాలు కవిత, మఠంపల్లి ఎంపీపీ ఎస్ ఉపాధ్యాయురాలు రాధమ్మ, జడ్పీహెచ్ఎస్ తెల్లబెల్లి ఉపాధ్యాయురాలు పద్మావతి, జడ్.పి.హెచ్.ఎస్ కోదాడ ఉపాధ్యాయురాలు పద్మావతి, ఎంపీపీ ఎస్ ఉపాధ్యాయులు వెంకటరమణ, కేజీబీవీ పెన్పహాడ్ ఆసియా జబీన్, కేజీబీవీ నూతనకల్ ఉపాధ్యాయురాలు హారిక, టీజీ ఎంఎస్ గడ్డిపల్లి శాంతి ప్రియలను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి డి ఎస్ పి ప్రసన్న కుమార్,డీఈవో అశోక్ బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహారావు డిటిడిఓ శంకర్ జి సి డి ఓ పూలన్,ఏ ఓ సుదర్శన్ రెడ్డి,సంఘ నాయకులు, సీనియర్ పాత్రికేయులు జనార్ధన్ డేగల, డాక్టర్ కృష్ణ బంటు, టీ హుస్సేన్, సిహెచ్ నరసింహ,యన్ వెంకట్, సత్యనారాయణ, సంతోష్ చక్రవర్తి, మహిళా ఉపాధ్యాయులు తదితరులు హాజరైనారు..