ప్రజాసేవ చేసేందుకు ఎస్ ఫౌండేషన్ స్థాపన. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 

Feb 6, 2025 - 20:15
Feb 6, 2025 - 20:19
 0  5
ప్రజాసేవ చేసేందుకు ఎస్ ఫౌండేషన్ స్థాపన. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 

నాగారం ఫిబ్రవరి 6 తెలంగాణ వార్త  ప్రజాసేవ చేసేందుకు ఎస్ ఫౌండేషన్ స్థాపించినట్లు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇటీవల నాగారం మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడోత్సవాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామస్థాయి క్రీడలలో గెలుపొందిన వారికి బుధవారం రాత్రి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ ఎస్ ఫౌండేషన్ ద్వారా అనేకమంది నిరుపేదలకు సేవ చేయనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఎస్ ఫౌండేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. రాజకీయాలకతీతంగా కులమతాలకు అతీతంగా సేవ చేయడమే ఎస్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ కబడ్డీ వాలీబాల్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి 25 వేల రూపాయల నగదు షీల్డ్ను ద్వితీయ బహుమతి పొందిన వారికి 20 వేల రూపాయల నగదు షీల్డ్ను అందజేశారు.ఈ కార్యక్రమంలో జీడి బిక్షం గుండ గాని అంబయ్య కల్లెట్లపల్లి ఉప్పలయ్య చిప్పలపెల్లి చిరంజీవి కూరం మణి వెంకన్న గుంటకండ్ల మణిమాల దోమల బాలమల్లు చిల్లర చంద్రమౌళి చిప్పలపెల్లి సోమయ్య కన్నెబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333