మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర గౌడ సంఘ నాయకులు

Feb 6, 2025 - 20:01
Feb 6, 2025 - 20:05
 0  7
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర గౌడ సంఘ నాయకులు

హైదరాబాద్ 06 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాదులో గురువారం రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నo ప్రభాకర్ గౌడ్ ని కలిసిన తెలంగాణ గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ బృందం తెలంగాణ రాష్ట్రంలో కళ్ళుగీత వృత్తిదారులకు పెండింగ్లో ఉన్న విషయాలు మరియు బీసీ సంక్షేమ శాఖ నుండి 25వేలు దహన సంస్కారాలు మరియు గాయపడ్డ వారికి వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వ ఏర్పాటు చేసిన మీరా కేంద్రాన్ని గౌడ కార్పొరేషన్ అప్పజెప్పాలని మరియు కెసిఆర్ 5 ఎకరాలు కోకాపేటలో కేటాయించిన భవనాన్ని వెంటనే ప్రారంభించి పనులు చేపట్టాలని ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. నల్గొండ జిల్లాలో మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్  ధర్మ బిక్షం గౌడ్ విగ్రహ ఏర్పాటు ఒక ఎకరం భూమి కేటాయించి ఐదు కోట్ల తోటి గౌడ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరడమైనది సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో అన్ని గౌడ సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు..వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ సదానంద గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి గుండాల మల్లేష్ గౌడ్ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్కాపూర్ శ్రీకాంత్ గౌడ్ హైదరాబాదులో రంగారెడ్డి నాయకులు వెంకటేష్ గౌడ్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*