ఉచిత దంత వైద్య శిబిరం కామినేని దంత వైద్య విజ్ఞాన సంస్థ హాస్పిటల్

Feb 7, 2025 - 11:10
Feb 7, 2025 - 11:12
 0  106
ఉచిత దంత వైద్య శిబిరం కామినేని దంత వైద్య విజ్ఞాన సంస్థ హాస్పిటల్

అడ్డగూడూరు 07 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం కామినేని దంత వైద్య విజ్ఞాన సంస్థ హాస్పిటల్ వైద్య బృందం వారు ఓపీ కాగితాలను వెల్దేవి గ్రామంలో పేషెంట్లకు అందజేశారు.నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని దంత వైద్య విజ్ఞాన సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన దంత వైద్య సేవలు అందించడమే కామినేని దంత వైద్య విజ్ఞాన సంస్థ యొక్క మల్టీ స్పెషాలిటీ దంత వైద్య ఆసుపత్రి యందు అత్యాధునికమైన పరికరములతో అనుభవిజ్ఞులైన వైద్య నిపులిచే అందించు దంత వైద్య బృందం మాట్లాడుతూ.. 8వ తేదీ శనివారం రోజు నార్కట్పల్లి లో పళ్ళ అన్ని సమస్యలకు ఉచితంగా చూడబడినని అన్నారు.1)పిప్పి పళ్ళకు సిమెంటు సిల్వర్ తో నింపుట 2)పిప్పి తో పూర్తిగా పాడైన పళ్ళను తీసివేయకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆర్ సి టి ద్వారా శిక్ష చేయుట 3)చిగుళ్ళు వాపు రావటం మరియు రక్తం కారటం పళ్ళ మీద మచ్చలు,గార వంటి సమస్యలకు క్లీనింగ్ మరియు శాస్త్ర చికిత్స బోన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయుట4)ఫ్లోరైడ్ నీళ్ల ద్వారా వచ్చే పంటి మచ్చలు కాస్మోటిక్ ట్రీట్మెంట్ ద్వారా బ్లీచింగ్ ద్వారా మరియు పింగాణి పూత ప్రోక్లిన్ వేనరింగ్ వీటి ద్వారా అందంగా సరి చేయుట 5)వంకర మరియు ఎత్తుపళ్ళకు క్లిప్పులు ద్వారా అందంగా సరి చేయుట, ఆర్థోగ్నతిక్ ఆపరేషన్ ద్వారా వికారమైన దవడ ఎముకలను సరిచేసి ముఖ సౌందర్యం పెంచుట.6)పళ్ళు లేని చోట వాటి స్థానంలో కొత్త పళ్ళను ఫిక్స్డ్ పళ్ళను అమర్చుట, పూర్తి పళ్ళు సెట్ ను తయారు చేయుట7) ప్రమాదమున విరిగిన దవడ ఎముకలు మరియు ముఖ ఎముకలు పళ్ళు గ్రహణ మొర్రి మరియు అంగిలి వంటి సమస్యలకు శాస్త్ర చికిత్స చేయబడును 8)నోటి మరియు నాలుక క్యాన్సర్లకు శాస్త్రచికిత్స9) గుట్కా పాన్ పరాగ్ మొదలైనవి వాడు వారికి వచ్చు నోటిదంత దవడ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక సలహా మరియు చికిత్స 10) చిన్నపిల్లల దంత సమస్యలన్నిటికీ సలహాలు చికిత్స చేయబడును అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్"ఎం అమూల్య, డాక్టర్"ఎన్ ప్రణవ్,డాక్టర్"ఎన్ తేజస్వి,డాక్టర్" సాయి నఫి,డాక్టర్"కె తేజస్విని, గ్రామస్తులు,పేషెంట్లు పాల్గొన్నారు.