పొంచి ఉన్న ప్రమాదం
జోగులాంబ గద్వాల 26 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతి నిధి:- గద్వాల జిల్లా నిన్న జరిగిన సంఘటన అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సంగమేశ్వర వీధి నందు ఆదివారం రోజు మధ్యాహ్నం కరెంటు స్తంభం విరిగి 4 సంవత్సరాల మహేష్ అనే బాలుడి తలపై పడి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అమ్మ హాస్పిటల్ దగ్గర విద్యుత్ స్తంభం తో పొంచి ఉన్న ప్రమాదం ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ నుంచి రాజీవ్ మార్గ్ కు వెళ్లే దారి ఇది. అమ్మ హాస్పిటల్ ముందు విద్యుత్ స్తంభం ప్రమాదంతో పొంచి ఉంది. ఎలాంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోక ముందే విద్యుత్ అధికారులు స్పందించి ఇట్టి విద్యుత్ స్తంభాన్ని సరిచేసి చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.