**కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టింది""తెలంగాణ జర్నలిస్టు మీడియా ఖమ్మం జిల్లాలో*

Feb 16, 2026 - 22:25
 0  1
**కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టింది""తెలంగాణ జర్నలిస్టు మీడియా ఖమ్మం జిల్లాలో*
**కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టింది""తెలంగాణ జర్నలిస్టు మీడియా ఖమ్మం జిల్లాలో*

ఖమ్మం జిల్లాలో తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్‌కు కొత్త నాయకత్వం… అభినందనల వెల్లువ

ఖమ్మం, ఫిబ్రవరి 16 ( తెలంగాణ వార్త ప్రతినిధి. రావెళ్ళ)

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ ఖమ్మం జిల్లాలో కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రావెళ్ళ. రవి కుమార్,

డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కే. రాజారత్నం,నియమితులైన సందర్భంగా జర్నలిస్టు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, మీడియా నైతిక విలువలను పరిరక్షిస్తూ సంస్థను మరింత బలోపేతం చేయడంలో వారి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ ఖమ్మం జిల్లా 

 ప్రెసిడెంట్ ఎండి ఫసియుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ వెంకట్రాజు కేశిరాజు నాయకత్వానికి కొత్తగా నియమితులైన నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఐ. ప్రభాకర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐక్యత, సమిష్టి కృషి, సేవాభావంతో తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతూ జర్నలిస్టుల స్వరాన్ని బలంగా వినిపించేందుకు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లో వారు విజయాలు సాధించాలని ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State