ప్రజావాణి కార్యక్రమం ద్వారా పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

Mar 19, 2024 - 00:06
 0  19
ప్రజావాణి కార్యక్రమం ద్వారా పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే
ప్రజావాణి కార్యక్రమం ద్వారా పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే
ప్రజావాణి కార్యక్రమం ద్వారా పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే

ప్రజలను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - ఎస్పి.

సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులను ఆదేశించిన ఎస్పి

ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పీ రాహుల్ హెగ్డే IPS  గారు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి పిర్యాదుదారుల నుండి పిర్యాదు తీసుకుని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఈరోజు 9 పిర్యాదులు రాగా ప్రతి పిర్యాదు దారునితో మాట్లాడి పిర్యాదులు సంభందిత అధికారులకు పంపించి పిర్యాదు వేగంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు బరోసా కల్పించాలని ఎస్పి గారు ఆదేశించారు. ఉద్యోగాలు, పధకాలు, బహుమతులు అంటూ అమాయక ప్రజలను ఆర్థికంగా మోసం చేసేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గారు  హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి వారిని నమ్మవద్దు, ఉద్యోగాలు, పదకాలు, బహుమతుల వస్తాయంటే ఇతరులను ఎవ్వరినీ కూడా నమ్మి డబ్బు ఇవ్వవద్దు అని గారు కోరినారు.


- ARSI కుటుంబానికి ఆర్థిక చేయూత. - చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే .

సూర్యాపేట జిల్లా ఆర్ముడ్ విభాగం బాంబ్ స్క్వాడ్ నందు పని చేస్తున్న ARSI వెంకటయ్య గారు ఆకాలంగా మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా ఇతని కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం ఈరోజు వెంకటయ్య గారి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు  శాఖ కృషి చేస్తుంది. చేయూత పథకం సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటున్నాయని అన్నారు. 

ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి నాగేశ్వరరావు, పోలీసుసమంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సంఘం సభ్యులు కృష్ణ,  సంక్షేమ RI నర్సింహ పాల్గొన్నారు.

 - మిని వాటర్ కూలర్ ను అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా..

జిల్లా పోలీసు కార్యాలయ నందు ప్రజావాణి హల్ కు మిని వాటర్ కూలర్ ను సూర్యాపేట పట్టణ బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ వారు బహూకరించారు. ప్రజావాణి హల్ నందు వాటర్ కూలర్ ను ఎస్పి గారు ప్రారంభించి మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా, సూర్యాపేట శాఖ వారిని అభినందించారు, ఇది ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే పిర్యాదు దారులకు, కార్యాలయానికి వచ్చే సిబ్బందికి చాలా ఉపయోగకరమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర రావు, AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, RI లు నారాయణ రాజు, నర్సింహ, బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333