ప్రజా పోరాటాల చరిత గల పార్టీ సిపిఐ
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాలలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సిపిఐ కార్యాలయాలలో ఎర్ర రంగులు రుద్దినట్టు ముస్తాబు చిగురుమామిడి మండల కేంద్రంలోని అమర జీవి కామ్రేడ్ ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించడం జరిగింది. మండల పరిధిలోని రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, ఓబులాపూర్, ముదిమాణిక్యం, రామంచ, ముల్కనూర్. పీచు పల్లి, సీతారాంపూర్, లంబాడి పల్లి గ్రామాలలో గ్రామ శాఖ కార్యదర్శులు భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం ఆయా గ్రామాలకు చెందిన సిపిఐ సీనియర్ నాయకుల్ని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది చిగురుమామిడి మండల కేంద్రంలో నీ సిపిఐ భవన్ లో మండల శాఖ కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు గడ్డం రామిరెడ్డి, ముక్కెర పోచయ్య, జంగ మైసయ్యాలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని అన్నారు. భూమికోసం, భుక్తి కోసం అణగారిన ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరాట చరిత గలిగిన పార్టీ సిపిఐ అని అన్నారు. ప్రజలపై జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలను సిపిఐ ఎండగట్టిందని అదే స్ఫూర్తితో 100 సంవత్సరాల ప్రజా జీవన పోరాటంలో కీలక పాత్ర సిపిఐ పార్టీ పోషిస్తుందని పేర్కొన్నారు గ్రామాలలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వాల మెడల్వంచుటకు అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన సిపిఐ కి ఘన చరిత్ర గలదని అన్నారు. ప్రభుత్వాలు పెంచిన ధరలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల వెనుక నీడలా ఉండి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచిన ఏకైక పార్టీ అని తెలిపారు ఇంత పోరాట శక్తి కలిగిన సిపిఐ పార్టీని గ్రామాలలో ప్రజలు ఆదరించి వాటిని ముందుకు సాగేలా సహకరించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి,, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముద్ర కోల రాజయ్య, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి అల్లెపు జంపయ్య, సహాయ కార్యదర్శి అనువోజు జనార్ధన్, రైతు సంఘం నాయకులు కయ్యం వీరన్న, సిపిఐ సీనియర్ నాయకులు మ్యాదర పోచయ్య, బొలుమల్ల ఆంజనేయులు, కొప్పుల వెంకటరాజం, మేకల లింగయ్య, మేకలలో ఇంకెవరు వచ్చారు ప్రజా పక్షం రిపోర్టర్ బొల్మల రాజమౌళి, ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు