మహిళలు తమ విధులలో  గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.

 జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు ఐపీఎస్

Mar 7, 2025 - 20:46
 0  2

జోగులాంబ గద్వాల 7 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని  జిల్లా ఎస్పీ శ్రీ టి .శ్రీనివాస రావు ఐపీఎస్   అన్నారు. రేపు అంతర్జతీయ మహిళ దినోత్సవం మార్చి-8 ను పురస్కరించుకొని  ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం లోని జిల్లా ఎస్పీ  మహిళ అధికారులలో ప్రత్యేక సమావేశం అయ్యారు.


      ఈ సంద్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో  ఎస్సై నుండి హోమ్ గార్డ్ అధికారి వరకు మహిళ అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు బయటకు రాని కాలంలో రుద్రమ దేవి లాంటి వారు రాజ్యాలను పాలించారని, సరోజని దేవి లాంటి వారు స్వతంత్ర ఉద్యమంలో  పాల్గొన్నారని, మహిళలకు రాజకీయాలు అంటే తెలియని కాలంలో ఇందిరా గాంధీ  దేశాన్ని పాలించారని , జిల్లాకు సైతం కలెక్టర్,ఎస్పి గా వచ్చిన మహిళ అధికారులు మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడున్న మహిళ అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి ఏంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చారని ఎందరో మహిళలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు అని అన్నారు. ప్రతి మహిళ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఇంట బయట చక్కగా రాణించగలగాలని, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని అన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఇప్పటికి చాలా మంది మహిళలు బయపడుతారని ఆ భయాన్ని తొలగించాలని , ప్రజలలో పోలీస్ పై మరింత నమ్మకాన్ని కల్గించాలని తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ఎస్పీ  సుచించారు.  పోలీస్ ఉద్యోగం రావాలంటే ఏంతో అదృష్టం ఉండాలనీ , రాజ్యాంగం కల్పించిన గురుతర బాధ్యతను పారదర్శకంగా అమలయ్యేలా విధులు ఉండాలనీ , మహిళ అధికారులు జిల్లా పోలీస్ పేరు ప్రతిష్టను మరింత పెంచేలా కృషి చెయ్యాలని ఆకాంక్షించారు. అనంతరం అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ గారు మహిళల చేత కెక్ కట్ చేయించి మహిళ అధికారులందరికి ప్రశంస పత్రాలను అందజేశారు. 


    ఈ కార్యక్రమంలో సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అర్ ఐ వెంకటేష్, ఐటీ, డీసీ ఆర్బి, ఎస్బి ఇంచార్జి ఎస్సై రజిత, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల మహిళ పోలీస్ అధికారులు, అన్ని విభాగాల పోలీస్ అధికారులు, భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333