వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Aug 14, 2025 - 18:51
 0  19

 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండల కేంద్రం ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం జరిగినది.


 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల కరస్పాండెంట్ మధులిక రెడ్డి హాజరై శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను గురించి  మాట్లాడుతూ విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కృష్ణాష్టమి రోజున చిన్ని గోపికలు కృష్ణులు ఉయ్యాలలో కృష్ణుడి ప్రతిమను తెలియపరుస్తూ కన్నుల పండుగ శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించడం.  ఈ చిన్నారులు కృష్ణుడి గోపికల వేషధారణలో అందరిని ఆకర్షించారని మొదటగా కృష్ణుని ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉయ్యాలలో చిన్నికృష్ణులు చిన్ని గోపికలు చాలా వేషధారణలు చాలా నన్ను ఆకర్షించిందని అన్నారు. విద్య నైపుణ్యం నందు ముందుకు సాగే దిశలో ఇలాంటి పండుగలు అందరం కలిసి జరుపుకోవడం చాలా అవసరమని గోపికలు కృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నారులందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ నందిని కేని, వైస్ ప్రిన్సిపాల్ మహిమ శ్రీ, అధ్యాపక బృందం, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333