మద్యం మత్తులో ఇంటికి నిప్పంటించిన కొడుకు

Mar 16, 2024 - 19:56
Mar 16, 2024 - 19:57
 0  10
మద్యం మత్తులో ఇంటికి నిప్పంటించిన కొడుకు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పాతర్ల పహాడ్  మద్యం మత్తులో ఇంటికి నిప్పంటించిన కొడుకు* తల్లిపై దాడికి యత్నించి బట్టలకు నిప్పంటించాడు. మంటలు ఆర్పేందుకు వచ్చిన వారిపై బెదిరింపులు. ఫైర్ ఇంజన్ సహకారంతో మంటలు అర్పిన గ్రామస్తులు... ఆత్మకూరు ఎస్... మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తన తల్లిపై దాడికి యత్నంచి తల్లి తప్పించుకోవడంతో తల్లి బట్టలకు నిప్పంటించి ఇల్లు తగలబెట్టిన సంఘటన మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన చిలుకూరి బాలయ్య ఉప్పలమ్మల ఏకైక కుమారుడు విక్రమ్ అటో నడుపుకుంటు మద్యానికి బానిసై తరచు తల్లిదండ్రులతో మద్యం డబ్బుల కోసం వేధించేవాడు. విక్రమ్ గత రెండు రోజులుగా తన తల్లిని మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. శనివారం తల్లి ఉప్పలమ్మను డబ్బులు ఇవ్వాలంటు దాడి కి యత్నించగా ఉప్పలమ్మ తప్పించుకున్నది. ఆ కోపంతో మద్యం మత్తులో ఉన్న విక్రం తన ఇంట్లోని బీరువాలో తల్లి బట్టలను తీసి తగలబెట్టాడు. ఆ మంటలు కాస్త ఇంటికి అంటుకొని ఇంట్లో సామాన్లతో పాటు బట్టలు పూర్తిగా కాలిపోయాయి. చుట్టుపక్కల వారు మండల ఆర్పేందుకు రాగా నా ఇల్లు నా ఇష్టం తగలబెట్టుకుంటానికి ఏమైనా చేసుకుంటాను మీరు ఎవరంటూ వారిని విక్రమ్ బెదిరించాడని గ్రామస్తులు ఆరోపించారు. చివరకు ఫైర్ ఇంజన్ సహకారంతో మంటలు ఆర్పారు . అప్పటికే ఇల్లు దాదాపు కాలి గోడలు స్లాబ్ పగుళ్లు ఏర్పడ్డాయి.ఇంటి నుండి మంటలు రావడంతో విక్రం అక్కడి నుండి పరారయ్యాడని తెలిపారు.