జయ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్
సూర్యాపేట 2 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ లు ఎంతగానో దోహదం చేస్తాయని సూర్యాపేట మండల విద్యాధికారి శేష గాని శ్రీనివాస్ అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో సైన్స్ఫెయిర్ జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు, భయకంపితులను చేసిన డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, పిఎస్ఎల్విసి-33,37 నమూనాలు, నానోట్యూబ్ నమూనా, ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్, కంట్రోల్డ్ బైరిమోట్, ఫుడ్కోర్టు, స్పేస్ రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ క్యాంప్లో తల్లి దండ్రులు తమ పరీక్షలు చేయించుకొని తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి ఎంతో ఆనందించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. భౌతిక, రసాయన, సాంఘీక శాస్త్ర, జీవశాస్త్రాలలోని విషయాల అనువర్తనాలను సులువుగా అర్థం అయ్యేలా తమ ప్రయోగాలతో వివరించారు. ఈ సైన్స్ ఫెయిర్ కు ముఖ్య అతిథులుగా సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్, సూర్యాపేట సెక్టోరియల్ అధికారి జనార్ధన్ లు విచ్చేసి ప్రసంగించారు. సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతున్నామని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను డైరెక్టర్లు జెల్లా. పద్మ, బింగి. జ్యోతి అభినధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.