తల్లిదండ్రుల ఏడిపించుటయే నీకు ఇష్టమా?
అత్తమామలను అవమానించడమే నీ నైజమా ?
వయసు మీద ఉన్నామని మురిసిపోవద్దు. చర్మం ముడతలు పడుతుంది ఒక్కసారి చూసుకో. నీ ఉనికికి ప్రమాదం దగ్గర్లోనే ఉన్నది జాగ్రత్త.
*************************************
---వడ్డేపల్లి మల్లేశం
ఎముకల గూళ్ళతో అస్తిపంజరాలుగా మారిన అభాగ్యులైన నీ తల్లిదండ్రులను, అంటే ముట్టనట్లు వ్యవహరించి మనిషికో నీతిని వల్లించి, అవమానాలతో ఈ సడించి, మనిషిగానే లెక్కించకూడదనే మయోపాయంలో కసిధీర కర్కషత్వాన్ని ప్రదర్శించి, చులకన చేసి మీ అత్త(తల్లి తండ్రి) మామలను భార్యాభర్తలుగా మీరు ఇద్దరు మానవత్వాన్ని మరిచి తెగించి కుటుంబానికి ద్రోహం చేస్తున్న సంగతి ఎవరికీ తెలియదనుకుంటున్నా రా? అయితే మీ నోటికి భయపడి కొందరు, గుండాయిజం రౌడీయిజానికి తలవంచి మరొకరు, ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతింటుందోనని మర్యాదతో మరికొందరు, మీ దురుసుతనాన్ని ప్రశ్నించకుండా తాత్కాలికంగా ఉంటున్నారు కాబోలు కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం చట్టాలు తీసుకున్నట్టుగా వృద్ధుల పరిరక్షణ చట్టంతో పాటు సమాజం కూడా మీ వెంటపడుతుంది జాగ్రత్త! ఇది ఒక కుటుంబానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు లక్షలాది కుటుంబాలలో ఎగబడి తెగబడి బూతు మాటలతో ఈ సడి o పులతో వెలివేతతో కత్తి కోత నరకం చూపిస్తున్న కొడుకులు కోడండ్ల యొక్క దుర్మార్గపు చేష్టలకు పరాకాష్టగా ఈ దుర్నీతిని సమాజం ఒక్కసారి పరిశీలించాలి. తల్లిదండ్రులను ఏడిపించడమే నీకు ఇష్టమా? అత్తమామలను అవమానించడమే నీకు నైజమా? అని సమాజంలోని భిన్న వర్గాలు ఎదురైన ప్రతి చోట ప్రశ్నించవలసిన అవసరం చాలా ఉన్నది. కొందరి నోటికి భయపడి,మరికొందరి దురుసుతనానికి దిగాలు పడి, మాట్లాడడానికి ధైర్యం చాలక మి న్నకుంటున్నారు కాబోలు! కానీ నలుగురు కూడిన చోట న్యాయం ఉంటుంది అన్నట్లు పదిమంది కలిసిన చోట పరిష్కారం దొరుకుతుంది. న్యాయవ్యవస్థ నడిచి వస్తుంది, అన్యాయం పైన తిరుగుబాటు చేయడానికి చట్టాల పరిజ్ఞానం మాత్రమే అవసరం లేదు ప్రజల వ్యవహారిక జ్ఞానం చాలా సరిపోతుంది.
దయచేసి స్పందించండి వృద్ధులను ఆదుకోండి:-
********************************************
ఇల్లు వాకిలి పిల్లలు సంసారము ఆదాయము సంపద అన్ని ఉన్న మనసు లేని కారణంగా వృద్ధులను అనాధాశ్రమంలో పడవేసి అటువైపు కన్నెత్తి చూడకుండా ఉంటున్న దుర్మార్గు ల్లారా! రాబోయేది మీ వంతే నని తెలుసుకుంటే మంచిది. కనీసం 20 సంవత్సరాల పాటు కనిపించిన తల్లిదండ్రుల కడుపుకోత ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించకపోతి వా? నీ భార్యకేం తెలుసు నడ మంత్రపు సిరి లాగా మధ్యలో వచ్చేసి మౌనంగా ఉండి దురుసుగా మాట్లాడి తనదేదో కోల్పోయినట్లు తనదంతా దానం చేసినట్టు అత్తమామల పైన అక్క సు వెళ్ళగక్కుతుంటే భర్త అయిన నీవు నీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించకుండా ఏంటి మూర్ఖుడిలాగా వ్యవహరిస్తావా? ప్రశ్నించవలసిన చోట ప్రతిమలా, ప్రతిఘటించవలసినటువంటి చోట మౌనంగా ఉంటే ఇo తె సంగతి .కన్న ప్రేమ పంచకుండా కాటేస్తారు. పిల్లల ప్రేమ అందకుండా అడ్డమొస్తారు. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులను లెక్క చేయరు. సంపద అంతా తమ ఖాతాలోనే వేసుకుంటారు. ఆ మాటకు భర్త కూడా మౌనంగా సై అంటారు. మధ్యలో వచ్చిన భార్యను కొద్ది సేపు వివాధాలలోకి లాగకుండా కొద్దిసేపు ఆగుదాం. కానీ కన్న కొడుకుగా తల్లిదండ్రుల కడుపులో పుట్టిన నీకు సిగ్గు, లజ్జ, అభిమానం లేకపోతే ఎలా? కనీసం 20 ఏళ్ల పాటు నిన్ను పెంచి పెద్ద చేసి అనారోగ్యం ఏర్పడిన, ఆకలితో మాడిన, అలసట తీర్చింది అన్ని తానై నీ కడుపు నింపింది. .తప్పటడుగుల మధ్యన పలుసార్లు భూమి మీద పడ్డప్పుడు, దెబ్బలు తాకినప్పుడు, తలకు గాయాలైనప్పుడు ఆందోళన చెందింది. అయ్యో నా కొడకా! అంటూ అలమటించి ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చింది. ఆకో అలమో పెట్టి దెబ్బల గాయం నయం చేసింది. ఆ కృతజ్ఞత మరిచిపోయినావా ద్రోహి! నీ తల్లి పోషించిన పాత్ర, కుటుంబానికి చేసిన మేలు, నీకు చేసిన సేవ, నిన్ను మనిషిగా చేసి దిద్దిన యావ, నీ భార్యకు నువ్వు చెప్పలేదు ఆమె అర్థం చేసుకోలేదు. అందుకే అత్తమామలు మనకేమి చేసినారు అని మౌనంగా నిన్ను తన వైపు తిప్పుకున్నది. తల్లిదండ్రుల మీద మనసు లేకుండా కసిదీరా నిన్ను కాటేస్తూనే ఉన్నది .
చర్మం ముడుతలు పడుతుంది జాగ్రత్త :-
**********************
50ఏళ్ళు దాటినా చర్మం ముడతలు పడిపోతున్న ఇంకా వయసు మీద ఉన్నట్టుగానే నటిస్తున్నారు. నీ దరిదాపులకు నీ అత్తమామలను రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మీ ఇంటి ముచ్చట్లు తెలవకుండా అడ్డుకుంటున్నారు. కనీసం మిమ్ముల పలకరించి యోగక్షేమాలు అడిగి కుటుంబ విషయాలను తెలుసుకుందామని తపన పడిన వారిని మచ్చుకైనా ఇంట్లోకి రానివ్వరు. నీ ముచ్చట్లు చెప్పరు. స్త్రీ సాన్నిహిత్యంలో ఎక్కడ బంగపాటు సంభవిస్తుందోనని తల్లిదండ్రుల ని కూడా కొడుకు పక్కనపెట్టి కట్టుకున్న భార్యకు సలాం చేసి బానిసగా బతుకుతున్నాడు చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యవ్వ లను మాత్రం ఆమ డ దూరంలో ఉంచుతున్నాడు. ఎక్కడైనా బుద్ధిమంతుడైన కొడుకు ఉంటే అయ్యవ్వల నువ్వు చూసుకుందామని ఆశపడితే భార్య పిల్లలు నరకం చూపిస్తున్నారు. బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తున్నారు. ఇక ఈ జీవితం చాలుననే విధంగా క్షోభకు గురిచేస్తున్నారు. .ఇది ఎక్కడో ఒకచోట జరిగిన సంఘటనకు పరాకాష్ట మాత్రం కాదు ప్రతి కుటుంబంలో నిరంతరం జరుగుతున్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన, అమానవీయ దుస్థితికి పరాకాష్ట.
వృద్ధుల పట్ల చట్టాలు బలంగా ఉన్నాయని చెప్పుకున్న, తల్లిదండ్రులను పోషించకపోతే చట్టాలు శిక్షిస్తాయని హెచ్చరికలు చేసిన, జైలు శిక్ష జరిమానాలు అమలులో ఉన్న ఆచరణలో మాత్రం అన్ని నిండు సున్నా. కారణం చట్టాలు న్యాయానికి చాలా తేడా ఉంటుంది. అమలయే చోట సహకరించే వాళ్ళు ఉండడం లేదు ఒకవేళ అందుబాటులో వృద్ధులు ఉన్నప్పటికీ వాళ్ళ గతి అంతే కదా అందుకే వాళ్ళు మాట్లాడే స్థితిలో లేరు వాళ్ళ కొడుకు కూడాను సహకరించే పరిస్థితిలో అసలే ఉండరు. కనిపించిన తల్లిదండ్రుల కంట్లో నలుసుగా కొడుకు మారితే అంతకుమించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అట్లనే అందరూ అలా లేరు. అలాగే ఎక్కడో పుట్టిన కోడళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా అత్తమామలను చూసుకుంటున్న ఆత్మీయులు కూడా ఉన్నారు. అయితే వారి శాతం ఎంత వారి ప్రభావం ఎంత? కనువిప్పు కలగాలి, మనుషులుగా మారాలి, మానవత్వం చిగురించాలి. ఈ ఇబ్బందులు, అణచివేత, వివక్షత తల్లిదండ్రులకు అత్తమామలకు మాత్రమే కాదు నాకు కూడా వర్తిస్తాయి అని ప్రతి ఒక్కరు అనుకుంటేనే మంచిది. ఎందుకంటే నీ కొడుకులు కూడా ఊరుకోరు జాగ్రత్త! నా కొడుకులు మంచి వాళ్ళని సంబరపడి మురిసిపోకు! అనచివేసి ఆందోళనకు గు రిచేసి అక్కసు తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉంది అని మర్చిపోకు! అందుకే తోటి మనిషిని సాటి మనిషిగా చూడడం నేర్చుకుందాం! తల్లిదండ్రులను గౌరవించడం నిర్విరామంగా కొనసాగిద్దాం! ఒకరింట పుట్టిన కోడలు తన ఇంట పుట్టిన బిడ్డ సమానమే అని సాటి చెబుదాం! అత్తకు ఒక నీతి తల్లికి ఒక నీతి అని సగర్వంగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి కొంతమంది ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు విజ్ఞప్తి చేద్దాం! ఈ వివక్షత మార్చాలని మార్చుకోవాలని మానాలని మానవీయ కోణంలో ఆలోచించాలని మరిచిపోవద్దని మరపు రావద్దని అవసరమైన చోట మౌనంగా ఉండకూడదు అని మానవత్వాన్ని ప్రదర్శించాలని మరీ మరీ కోరుకుందాం. ఇక ఇంటబుట్టిన కన్నకొడుకే కర్కసుడై కాటు వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు తగిన శాస్తి జరగాలి సమాజం శిక్షించాలి. "భార్యాభర్తలు గా మీరు కలిసి అత్తమామలను తల్లిదండ్రులను గౌరవించండి. రేపు మీ బతుకు కూడా సుభిక్షంగా సాగాలంటే ఇది తప్పనిసరి. ఎందుకంటే మిమ్ములను చూసి మీ కొడుకులు నేర్చుకుంటారు. తరిమి తరిమి ఉరవతలికి సాగనంపుతారు. ఆ దుస్థితి రాకముందే ఆలోచించుకోండి మనుషుల్లో కలవండి ."
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)