పెద్ద అగ్రహారం పాఠశాలను నిర్మించాలి . CPM
జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పట్టణంలోని చింతలపేట లో ఉన్న పెద్ద అగ్రహారం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరిందని, తక్షణమే పాఠశాలను కూలదోసి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సర్వేలో భాగంగా రెండవ రోజు చింతలపేట,మద్రాస్ పేటలలో వార్డులలో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపేటలోని పెద్ద అగ్రహారం ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పాఠశాలను కూల్చివేసి నూతన ప్రాథమిక పాఠశాల భవనాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థలాన్ని సర్వే చేసి పాఠశాల చుట్టూ కంచే ఏర్పాటు చేయాలన్నారు.వార్డులో ప్రజల నివాసాల మధ్యలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్ల, బురద పేరుకుపోయి వర్షాలు వచ్చిన సందర్భంగా ఇండ్లలోకి మురుగునీరు చేరుతున్నాయన్నారు.పందికొక్కులు పాముల సంచారంతో పాటు తీవ్ర దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. మురుగునీరుని బయటికి పంపే మార్గం లేకపోవడం వల్ల ఎక్కడికి అక్కడ నిలిచిపోయిందని,వార్డులోని కొన్నిచోట్ల కొళాయినీరు, మురికి కాలువ రెండు కలిసిపోయాయన్నారు.మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గత మూడు రోజులుగా ప్రజలు త్రాగునీరు రాక ఇబ్బందులకు గురయ్యాయరని అన్నారు. వీధిలో ఉన్న బోరు తరచూ మరమ్మతులకు గురి అవుతున్నదని అన్నారు.ప్రభుత్వం నిర్మించిన ప్రకృతి వనాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అపరిశుభ్రంగా తయారయ్యాయని, దీనివల్ల చుట్టుపక్కల దోమలు పెరిగి అనారోగ్యాలకు కారణం అవుతుందన్నారు.వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల హై వోల్టేజ్ వల్ల తరచూ టీవీలు, ఫ్యాన్లు రిపేర్లు అవుతున్నాయన్నారు.వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు కంచే ఏర్పాటు చేయాలన్నారు. సునీత గారి ఇంటి ముందు, గౌరమ్మ ఇంటి పక్కన, ముంతాజ్,జడలయ్య ఇంటి పక్కన ఉన్న స్తంభాలు శిథిలావస్థకు చేరాయని వాటిని తక్షణమే తొలగించాలన్నారు.వడ్డెర కమ్యూనిటీ హాల్ పక్కన అపరిశుభ్ర వాతావరణ నెలకొందని తక్షణమే పిచ్చి మొక్కలను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.దోమల నివారణకు మందు సక్రమంగా పిచికారి చేయకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల తరచూ ప్రజలు ఆసుపత్రుల బాట బాటపడుతున్నారన్నారు.అర్హత ఉన్నపటికీ వృద్ధాప్య,ఒంటరి మహిళల పింఛను రావడం లేదన్నారు. పార్వతమ్మ ఇంటి ముందున్న వీధిలైటు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. వెంకటమ్మ ఇంటి నుండి మొలల ఆసుపత్రి వరకు సందులో లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.అధికార యంత్రాంగం తక్షణమే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో రామకృష్ణ,అంజి,ఎల్లప్ప,చంద్రుడు, మహేష్, రామాంజి తదితరులు పాల్గొన్నారు.