వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.
జిల్లా కలెక్టర్ కు కరపత్రం అందజేసిన ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
భువనగిరి 24 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా అధ్యక్షులు సురప్పంగ ప్రకాష్ ఈ జూలై 30 31వ తేదీన రామన్నపేట మండల కేంద్రంలో జరిగే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వికలాంగులను చైతన్య పరచడంలో ఎన్ .పి.ఆర్.డి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రజా ప్రభుత్వంలో వికలాంగులకు ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు జీవో ను విడుదల విడుదల చేయాలని ఈనెల 30,31న రామన్నపేట పట్టణంలోని జేపీ ఫంక్షన్ హాల్ జరిగే జిల్లా మూడవ మహాసభల జయప్రదం కోసం జిల్లాలోని వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 300 నుంచి 3000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలులో భాగంగా వికలాంగుల పెన్షన్ 6000 పెంచాలని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహాసభలలో జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళ జిల్లా కన్వీనర్ కొత్త లలిత,పాండాల కే అంజన్,పి గోపి తదితరులు పాల్గొన్నారు.