ప్రైవేట్ జ్ఞాన సరస్వతి అరగిద్ద స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోని
కేసు నమోదు చెయ్యాలి అని అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన నాయకులు.
బిఎస్పీ గద్వాల్ నియోజకవర్గం అధ్యక్షులు బండారి s రాజు.
స్వేరో జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు బండారి సునంద్.
జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : (గట్టు మండలం) గట్టు మండలం లోని సల్కాపురం గ్రామము నుండి అరగిద్ద కు వెళ్లే జ్ఞాన సరస్వతి స్కూల్ టాటా ఆటో లో 20మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరికి ప్రధానమైన గాయాలు మిగతా వారికి గాయాలైనవి, డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చెయ్యడం వలనే టాటా ఆటో బోల్తా పడింది, తక్షణమే జ్ఞాన సరస్వతి స్కూల్ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ స్కూల్ గుర్తింపు తక్షణమే రద్దు చేయాలి అని అడిషనల్ కలెక్టర్ కి వివరించారు, జిల్లాలో అన్ని ప్రైవేట్ స్కూల్లో బస్సులు రద్దు చేయాలి అప్పుడే ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం వస్తుంది, తక్షణమే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లో పై కఠిన చర్యలు విధించే విధంగా ఫీజులు నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని అని అన్నారు, ప్రయివేట్ స్కూల్ బస్సుల పైన అధికారులు కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు ,సీట్ల పరిమితి కన్నా ఎక్కువ గొర్రెమందల్లాగా ఎక్కించుకొని రావడం రావడం మరియు క్లీనర్ లేకపోవడం వలన ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమం లో చింతరేవుల సురేష్, నగేష్ పాల్గొన్నారు.