పెండింగ్ లో ఉన్న లెప్రసి సర్వే డబ్బులు వెంటనే విడుదలచేయాలి.CITU డిమాండ్
జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఆశ వర్కర్లకు పెండింగ్ లో ఉన్న లెప్రసి సర్వే డబ్బులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత డిమాండ్ చేశారు శనివారం జిల్లా కేంద్రంలోని DMHO కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న లేప్రసి సర్వే డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రోగ్రామ్ అధికారి కి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆశ వర్కర్ల చేత లెప్రసీ సర్వేలు చేయించిందని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా జిల్లాలోని ఆశా కార్యకర్తల చేత 14 రోజులపాటు సర్వే చేయించారని అన్నారు. సర్వే చేసినందుకుగాను ప్రభుత్వం రోజుకు 70 రూపాయలు చొప్పున చెల్లిస్తామని చెప్పిందని అన్నారు. కానీ సర్వే పూర్తయి సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు డబ్బులు విడుదల చేయలేదని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషనర్ ఆఫీసులో సంబంధిత అధికారులను తమ యూనియన్ రాష్ట్ర నాయకత్వం కలవగా, డబ్బులను విడుదల చేశామని జిల్లా అధికారులకు పంపామని చెప్పారని అన్నారు. DMHO కార్యాలయాలలో లేప్రసి డబ్బుల గురించి అడిగితే, ప్రభుత్వం లేప్రసి సర్వే డబ్బులు పంపలేదని చెబుతున్నారని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం వల్ల ఆశా కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి లోనవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేప్రసి సర్వే డబ్బులు విడుదల చేయలేదా, లేకపోతే విడుదల చేసిన జిల్లాలలోని DMHO కార్యాలయాల లో పెండింగ్ లో ఉన్నాయా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు .అసలే ఫిక్స్ డ్ వేతనాలు లేక అదనపు పని భారాలతో ఇబ్బంది పడుతున్న ఆశా కార్యకర్తలను, పని చేయించుకొని మరి ప్రభుత్వం, అధికార యంత్రాంగం మోసం చేయడం సరైనది కాదని అన్నారు.గతంలో చేసిన లేప్రసి సర్వే కు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుంటే మళ్లీ కొత్తగా లెప్రసి సర్వే చేయాలని ఆశా కార్యకర్తలపై ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసకరమని ప్రశ్నించారు.? ఆశా కార్యకర్తల కష్టార్జితం ఎవరి జేబులలోకి వెళ్ళాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న లేప్రసి సర్వే డబ్బులు విడుదల చేసిన తర్వాతే ఈ సంవత్సరం లెప్రసీ సర్వేలో పాల్గొంటామని,కాదని ఒత్తిడి చేస్తే ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ?ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు షకీలా సుభాషిణి కవిత సత్యమ్మ సంధ్య సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు
ధన్యవాదాలతో
ఉప్పేర్ నరసింహ
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు ఉన్నారు.