పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, జడ్పీ సీఈవో,, డిఇఓ
జోగులాంబ గద్వాల 12 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మల్దకల్:. బడి బయట పిల్లలను బడిలో చేర్పించడంలో మహిళా సంఘాలు దత్తత తీసుకొని చురుకైన పాత్ర పోషించాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు లాభాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించి అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారు కృషి చేయాలని చైర్మన్ మరియమ్మ,సభ్యులకు జడ్పీ సీఈవో కాంతమ్మ సూచించారు. బుధవారం మండల పరిధిలోని అమరవాయి గ్రామంలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వి.నరేష్ అధ్యక్షతన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.ఈ వేడుకలకు జెడ్పి సీఈవో కాంతమ్మ,జిల్లా విద్యాశాఖ అధికారి ఇందిర,మల్దకల్ మండల విద్యాధికారి సురేష్,ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, సెక్టోరల్ అధికారి హంపయ్య ,ఏపిఎం నరహరి పాల్గొన్నారు.
6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండే విధంగా అందరూ కృషి చేయాలని డిఇఓ ఇందిర సూచించారు.పాఠశాలకు క్రమముగా హాజరుకాని పిల్లలను బడికి పంపించాల్సిన బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు.సీఈవో,డీఈవో,ఎంఈఓ,ఏ ఏ పీ.సి చైర్మన్,ఎంపీటీసీ గోపాల్ రెడ్డి,ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా,విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ విజయలక్ష్మి,పాఠశాల ఉపాధ్యాయ బృందం, జానకమ్మ ,సుమలత ,నాగరాణి ,ప్రసన్నకుమార్, అనిత,వీణానకుమారి, వెంకట్రాములు,సుష్మ ప్రియాంక,ఈరన్న,అరుణ రాణి,అంగన్వాడి టీచర్స్,ఆశా కార్యకర్తలు,మహిళా సంఘాల సభ్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.