జాతీయ నులి పురుగుల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం వైద్య అధికారులు.
జోగులాంబ గద్వాల 12 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి"- తేదీ.12.6.2024 న పాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, కే మధుసూదన్ రెడ్డి, పి. నరేంద్రబాబు టి. వరలక్ష్మి , మొదలగువారు గద్వాల అర్బన్ అంగన్వాడీ టీచర్లకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు..
తేదీ 20.06.2024 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రతి అంగన్వాడి స్కూలు, మరియు ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు మరియు ప్రభుత్వ ,ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్నాము తెలిపారు..
1 - 2 సంవత్సరాలలోపు పిల్లలకు 1/2 ఆల్బెండజోల్ టాబ్లెట్ పొడిచేసి నీటిలో కలిపి తాపాలని..
2 - 19 సంవత్సరంలోపు పిల్లలకు ఒక టాబ్లెట్ ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి నమిలి మింగమని విద్యార్థులకు సూచించాలని
ఆల్బెండజోళ్ టాబ్లెట్స్ ను మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వేసుకోవాలని , విద్యార్థులకు సూచించాలని తెలిపారు..
20.6.2024 న ఏదైనా అనివార్య కారణాలవల్ల ఆల్బెండజోల్ మాత్ర వేసుకునకపోతే, మిగిలిన విద్యార్థులకు 27.6.2024 తేదీన Mop Up రౌండ్ లో వేస్తారని తెలిపారు..
సాధారణంగా పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ అనేది చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం, ఆరుబయట వట్టికాళ్లతో ఆడుకొనుట, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాల వల్ల, నీరు మరియు ఆహారం కలుషితం కావడం వల్ల పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ జరుగుతుంది..
ఈ నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకారలోపము, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారము, వీరేచనాలు, బరువు తగ్గడం ,ఆందోళన మొదలగు లక్షణాలు కనిపించవచ్చు..
ఈ నులిపురుగుల సంక్రమణ అనేది విద్యార్థులలో కలగకుండా ఉండాలంటే ముఖ్యంగా, విద్యార్థులు వారంనకు ఒకసారి గోర్లు కత్తిరించుకోవడం, ఆరుబయట ఆడుకునేటప్పుడు మరియు స్కూలుకు వెళ్లేటప్పుడు బూట్లు, లేదా చెప్పులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా ఉండటం ,వ్యక్తిగత మరుగుదొడ్డిని వాడటం, భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, పండ్లు కాయగూరలను శుభ్రమైన నీటితో కడుక్కోవడం, ఆహారంపై మూతలు ఉంచటం, ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని తాగడం ,పరిశుద్ధ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వల్ల ఈ నులిపురుగుల సంక్రమణ నుంచి దూరంగా ఉండవచ్చని విద్యార్థులకు అంగన్వాడి టీచర్లు అవగాహన కలిగించాలని తెలిపారు..
ఈ అవగాహన కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ అంగన్వాడి టీచర్లు, ఆరోగ్య శాఖ వైద్య సిబ్బంది సూపర్వైజర్లు కమ్యూనిటీ ఆఫీసర్లు హనుమంతు నర్సింలు తదితరులు పాల్గొన్నారు...