పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని అవినీతి బీఆర్ఎస్ ను ఓడించండి

May 11, 2024 - 19:30
 0  6
పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని అవినీతి బీఆర్ఎస్ ను ఓడించండి

 నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్   అభ్యర్థి కుoదూరు రఘువీర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించండి.   ఆవాజ్  సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నజీర్ ఖాన్ పిలుపు 
 సూర్యాపేట పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించి నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ని అధిక మెజార్టీతోగెలిపించాలని ఆవాజ్  సూర్యాపేట జిల్లా అధ్యక్షులు  నజీర్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగినటువంటి  జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై  బిజెపి 10 సంవత్సరాల పాలనలో పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రశ్నించే గొంతులపైఅక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినమోడీప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు.నల్లధనం తెచ్చి ప్రతి ఎకౌంట్ లో 12 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పినేటికీ చేయలేదన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేస్తూ అక్రమంగా అప్పనంగా అంబానీ,అదాని లకు కట్టబెడుతుందని ఆరోపించారు. పేద ప్రజలపై నిత్యవస వస్తువుల భారం మోపిందన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గానికి తీరని నష్టం చేకూర్చిందన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతాంగం ఏడాది పాటు పోరాటం చేసి సాధించుకున్న డిమాండ్లను నేటికీ పరిష్కారం చేయలేదు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కార్పొరేట్ శక్తులకు  అమ్మింది అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి నాయకులు పదేపదే చెబుతున్నారని రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుoదూరు రఘువీర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మతోన్మాద బిజెపికినల్గొండ జిల్లాలో స్థానం లేదన్నారు.అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న శానంపూడి సైదిరెడ్డి నీ కంచర్ల కృష్ణారెడ్డిని  ఓడించాలని పిలుపునిచ్చారు . ఇట్టి కార్యక్రమంలో అవాజ్ కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333