బాలెంలా ఎల్లమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
అడ్డగూడూరు 27 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ మాదిగ మాతృమూర్తి బాలెంల ఎల్లమ్మ మృతి చెందిన వార్త తెలుసుకొని అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎల్లమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.బాలెంల నరేష్ కు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఫోన్ ద్వారా పరామర్శించి మనోధైర్యం తెలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ,సీనియర్ నాయకులు బోడ యాదగిరి మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి పనుమటి సతీష్ మాదిగ,సీనియర్ నాయకులు గజ్జెల్లి వినోద్ మాదిగ,గజ్జెల్లి రవి మాదిగ, అలవాల శంకర్ మాదిగ,గజ్జెల్లి కృష్ణ మాదిగ,వి.హెచ్.పి.ఎస్ మండల అధ్యక్షులు యాదగిరి,బాలేంల అయోధ్య,బాలేంల రాజు,డప్పు మల్లేష్, బాలేoల పరుశరాములు,బాలెంల నరేందర్,బాలెంల మహేందర్ మాదిగ,పనికెర సూర్య,బోడ పాండు, పనుమటి సైదులు తదితరులు పాల్గొన్నారు.