పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి .జిల్లా కలెక్టరు తేజస్ నంద్ లాల్ పవర్

Jul 27, 2025 - 05:59
Jul 27, 2025 - 14:13
 0  7
పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి .జిల్లా  కలెక్టరు తేజస్ నంద్ లాల్ పవర్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి.... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుతున్నారు...... ప్రభుత్వ హాస్టల్ లో తాజా కూరగాయలు,పాలు, పెరుగు, వంట సామాగ్రి నాణ్యత పాటించాలి... వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకి సలహాలు, సూచనలు.... సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలి.... అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనల ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు... ఆత్మకూర్ (ఎస్ ) లో విస్తృత పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తే విద్యార్థుల ఆలోచనలు మెరుగ్గా ఉంటాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు (ఎస్ ) మండల కేంద్రంలోని జెడ్.పి.హెచ్.ఎస్,ప్రాథమిక పాఠశాల , అంగన్వాడీ, తహసీల్దార్,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలను సందర్శించారు. మొదట జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ను సందర్శించి అక్కడ వేసిన రంగులు, గోడలపై చిత్రాలు, మరియు పాఠశాల పర్యావరణాన్ని పరిశీలించి, అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ మరియు సృజనాత్మక వాతావరణం అందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ప్రాథమిక పాఠశాల కు వెళ్లిన కలెక్టర్ గ 5వ తరగతి విద్యార్థులతో చక్కగా మమేకమై, ఇంగ్లీష్ పాఠాన్ని చదివించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించి వారు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వడం గమనించి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల నోట్స్ కూడా పరిశీలించి మెచ్చుకున్నారు. అనంతరం 5వ తరగతి విద్యార్థులందరికి నోటుబుక్స్, పెన్నులు అందజేశారు. తదుపరి కలెక్టర్ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు.శరీర భాగాలు బొమ్మ చూపెట్టి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.పిల్లలు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలని కలెక్టర్ తెలపగా వర్షం వల్ల రాలేదని కలెక్టర్ కి వివరించారు. తదుపరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి వంట గదిలోని టమాట, ఇతర కూరగాయలు పరిశీలించి టమాట బాగాలేకేపోవటం తో వెనక్కి పంపించారు. ప్రభుత్వ హాస్టల్ లో కూరగాయలు,పాలు, వంట సామాగ్రి విషయం లో నాణ్యమైన వి ఉపయోగించాలని తెలిపారు. పదవ తరగతి లో జరుగుతున్న పి ఈ టి డిజిటల్ క్లాస్ ని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.సి సి కెమెరా లు పని చేస్తున్నాయా అని ఎస్ ఓ ని అడిగినారు. భూ భారతి రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన ఆర్జీలపై అధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్జీలకి సంబంధించిన ఫైల్స్ పరిశీలించారు అలాగే నోటీసులు త్వరగా జారీ చేసి క్షేత్ర స్థాయి లో పర్యటన చేయాలని ఆదేశించారు.మొత్తం 3983 అర్జీలను స్వీకరించామని, 1810 ఆర్జిదారులకి నోటీసులు ఇవ్వటం జరిగిందని కలెక్టర్ కి తహసీల్దార్ వివరించారు. వన మహోత్సవం లో భాగంగా తుమ్మల పెన్ పహాడ్ క్రాస్ రోడ్ నందు అవెన్యూ ప్లాంటేషన్ లో పాల్గొని కలెక్టర్ మొక్క నాటినారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, నీరు పోసి కాపాడాలని తెలిపారు. వర్షాకాలం మొదలు అయినందున వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి రైతులకి సలహాలు, సూచనలు ఇచ్చేలా ఆదేశించటం జరిగిందని డి ఏ పి, యూరియా నిలువలు కావాల్సినంత ఉన్నాయాని దీనిపై వ్యవసాయ అధికారులు రోజు వారి నివేదికలు అందించటం జరుగుతుందని అన్నారు. వర్షాకాలంలో దోమల ద్వారా, నీరు కాలుష్యం అవ్వటం ద్వారా జ్వరాలు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్స్, పి హెచ్ సి డాక్టర్లు ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందుతున్నాయని ప్రజలకి నమ్మకం కల్పించాలని అలాగే సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని తెలిపారు. అధికారులందరు క్షేత్ర స్థాయి లో పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయని వెంటనే పరిష్కరించి ప్రజలకి మెరుగైన సేవలు అందించవచ్చు అని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ నాయక్,తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపిడిఓ మహమ్మద్ హసీం,ఎం.ఈ.ఓ ధారసింగ్ , జెడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ , ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ వనజ, ఆర్ ఐ లు ప్రదీప్, స్వప్న,ఇతర ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు. ..