పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

తుంగతుర్తి మార్చి 01 తెలంగాణవార్త ప్రతినిధి:- పల్స్ పోలియో అనేది పోలియో వైరస్‌కు వ్యతిరేకంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ టీకాలు వేయడం ద్వారా భారతదేశంలో పోలియోమైలిటిస్ (పోలియో) ను తొలగించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోగనిరోధక ప్రచారం ఈ ప్రాజెక్ట్ పెద్ద-స్థాయి, పల్స్ టీకా కార్యక్రమం మరియు పోలియోమైలిటిస్ కేసుల పర్యవేక్షణ ద్వారా పోలియోతో పోరాడుతుంది.
తుంగతుర్తి మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీలో ఏరియా ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ చింతమల్ల నిర్మల్ కోరారు. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం తుంగతుర్తి ఆరోగ్య కేంద్రం పరిధిలో 4 రూట్లలో 36 పోలియో చుక్కల కేంద్రాలలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు సంఖ్య 4374 పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు, ఉండే పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేస్తారని, ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేయాలని డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ సముద్రాల సూరి, రవికుమార్, డి.పి.ఎమ్.ఓ సురేష్, పి హెచ్ ఎన్ సైదమ్మ, హెచ్.వి జానకమ్మ, నవీన్, వేణుగోపాల్, హెల్త్ అసిస్టెంట్స్ యాదగిరి, నరసింహ చారి, సోమన్న, ఏఎన్ఎంలు రజిత ,నాగలక్ష్మి, స్వాతి, జయమ్మ, స్వర్ణలత, కమల, మౌనిక, ఉమా ,భారతి, శైలజ నాగమణి, స్వరూప, స్వప్న, రూప, వివిధ గ్రామాల ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.