బోనాల పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి

Aug 26, 2025 - 19:50
 0  32
బోనాల పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త  : చిన్నంబావి మండల కేంద్రంలోని బెక్కెం గ్రామంలో సుంకులమ్మ  బోనాలు ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.గ్రామంలో   జరిగిన బోలన పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ ప్రజలు చిన్న పిల్లలు ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుకులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం సుంకులమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు.మన ఊరి దేవత అమ్మవారి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుందని తెలిపారు.పంట పొలాలు పచ్చగా వుండాలని వానలు బాగా కురవాలని గ్రామ ప్రజలు సంతోషంగా వుండాలని 
సుంకులమ్మ తల్లిని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దల   ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333