విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

Mar 5, 2024 - 19:40
Mar 7, 2024 - 01:49
 0  5
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

.నూతనకల్.. న్యూస్.. విద్యార్థులు భవిష్యత్తుపై ఆసక్తి పెంచుకొని ఏకాగ్రతతో చదివాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి 10వ తరగతి పరీక్షలు బాగా వ్రాసి మంచి ర్యాంకులు సాధించాలని మండల పరిధిలోని పెదనెమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. శివయ్య అన్నారు. మంగళవారం కొత్త తండా గ్రామస్తుడు బానోతు శ్రీను నాయక్ పాఠశాలలోని 27 మంది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు బహుకరించడంతో పాటు విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. దాత శ్రీను నాయక్ ని ప్రధానోపాధ్యాయులు శివయ్య తో పాటు సిబ్బంది సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉమారాణి, కవిత, ఉప్పయ్య నాయక్, వెంకయ్య, పద్మావతి, మంజుల, శ్రీదేవి, సిఆర్పి రవీందర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333