పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జోగులాంబ గద్వాల 2 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పల్స్ పోలియో పై అవగాహనా కలిపించాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ శశికళ అన్నారు.శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోలియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించుటకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు జండా ఊపి పల్స్ పోలియో కార్యక్రమం ర్యాలీ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు ,నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పల్స్ పోలియో కార్యక్రమం గురించి నినాదాలు ఇస్తూ పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగించి ప్రజలకు పల్స్ పోలియో కార్యక్రమం గురించి అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ... పల్స్ పోలియో కార్యక్రమం 03.3.2024 నుండి 05.03 2024 నిర్వహిస్తున్నామని, జోగులాంబ గద్వాల జిల్లాలో 0 - 5 సంవత్సరాల పిల్లలు దాదాపు 70,514 ఉన్నారని వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రేపు (ఆదివారం) న పల్స్ పోలియో బూత్ కార్యక్రమం ఉంటుందని ఆరోజు ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడి టీచర్లు 0 - 5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.. తేదీ 4.3.2024 &5.3.2024 వైద్య సిబ్బంది మరియు అంగన్వాడి టీచర్లు ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 448 పల్స్ పోలియో బూతులు,899 బృందాలు, 1792 బృందం సభ్యులు, 42 పల్స్ పోలియో రూటు సూపర్వైజర్లు,13 ట్రాన్సిట్ పాయింట్లు, 12 మొబైల్ టీంలు, 94 మై గ్రేటరీ మరియు హైరిస్క్ సైట్స్, ఉన్నాయని తెలిపారు..
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు. డాక్టర్లు స్రవంతి ,ఇర్షాద్, రాజు,మాధుర్య, రాధిక,రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కే. మధుసూదన్ రెడ్డి, రామకృష్ణుడు, నరేంద్రబాబు, తిరుమలేష్ రెడ్డి,వరలక్ష్మి, శివన్న వెంకటేష్, శ్యాంసుందర్, మక్సుద్, వినీత్, కృష్ణ హనుమంతు, అబ్రహం , నరసింహ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు.