పల్లోటి హైస్కూల్లో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు..ముఖ్య అతిథిగా ఎస్సై కె.వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 15 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలోని సెంట్ విన్సెంట్ పల్లోటి హైస్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అడ్డగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం జాతీయ గీతాలాపన ఆలపించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ : ఎందరో స్వాతంత్ర పోరాట యోధుల త్యాగ ఫలితమే మనం ఈరోజు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణంలో గర్వంగా జరుపుకుంటున్నామని అన్నారు. నేటి బాలలే..రేపటి భావి భారత పౌరులని..విద్యార్థిని విద్యార్థులకు గుర్తు చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని,దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలర్పించారని ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని కోరుతూ.. విద్యార్థిని విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు.విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు బాగా అలరింప చేశాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గోవిందాపురం చర్చి ఫాథర్ లూర్ద్ మరెడ్డి,మాజీ ఎంపీటీసీ కోఆప్షన్ నెంబర్ మాదాను ఆంథోని,మాజీ సర్పంచ్ వేర్వోనిక చిన్నప్ప,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ రీనా శాలిని, ప్రిన్సిపాల్ సిస్టర్ సెల్వి , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం,పాల్గొన్నారు.