ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎస్సై రాజు
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- జగ్గయ్యపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్సై రాజు నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు,పోలీస్ అధికారులు హెచ్చిరిక. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, ఆదేశాల డీసీపి మహేశ్వర రాజు ,ఏసీపీ ABG తిలక్ జగ్గయ్యపేట సిఐ P వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మేరకు 2025 నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహిoచుకొను వేడుకలను ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకొని ఆంక్షలు తప్పనిసరి చేయటమైనది. కావున ప్రజలు ఈ విషయాన్నీ గుర్తించి పోలీసులకు సహకరిస్తూ,పోలీసు విధించే కఠిన చర్యల నుంచి దూరంగా వుండాలని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట ఎస్సై రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలకు సూచనలు, అర్దరాత్రి రోడ్డుమీద వేడుకలకు అనుమతులు లేదు.రాత్రి 11 గంటల తరువాత వాహనములు నడుపు వ్యక్తి అతి వేగంగా,అజాగ్రత్తగా వాహనము నడపరాదు. వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ నడపరాదు.మద్యం సేవించి వాహనములు నడపరాదు. ప్రధాన రహదారులు అయిన చిల్లకల్లు -జగ్గయ్యపేట రోడ్డు, మండల పరిధిలో హైవే రోడ్డు, గ్రామాల్లో సిసి రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించబడును. రోడ్డువైపు అనుమతించబడదు. గుoపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదు.డిసెంబర్ 31వ తేది రాత్రివేళ కేకలు వేస్తూ వాహన0లపై తిరగరాదు. హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు. డిసెంబర్ 31వ తేది రాత్రివేళ మండలం లో గస్తీ ముమ్మరంగా వుంటుంది. ప్రత్యేక హెచ్చరిక.మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.మద్యం సేవించి వాహనములు నడిపిన వారిపై చర్యలు తీసుకోన బడును. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరేత్తిoచడం, అతి వేగంతో రోడ్ల పై తిరగటం, వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణాసంచా పేల్చడం వంటి వాటివలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్దులకు, చిన్న పిల్లలకు, రోగులకు ఇబ్బంది కలుగుతుంది. కావున ఇలాంటి వాటికీ పాల్పడితే తగిన చర్యలు తీసుకోనబడును. అలాగే పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంది ,పై సూచనలను పాటించి నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకర వాతావరణం లో జాగ్రత్తగా రోడ్డు ప్రమాదములకు లోను కాకుండా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎస్సై రాజు తెలిపారు