పబ్లిక్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తా క్లబ్లో రాజకీయాలకు తావులేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి డబల్ షటిల్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
చార్మినార్ ఎక్స్ ప్రెస్...సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో ఎస్ఎస్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసనికి దోహదపడతాయని పబ్లిక్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మార్చి అభివృద్ధికి సహకరిస్తానని పబ్లిక్ క్లబ్ లో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని క్లబ్బును ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధికి సహకరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు,పూర్వ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి నూకల సుదర్శన్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కోశాధికారి కక్కిరెని శ్రీనివాస్, పబ్లిక్ క్లబ్ ఈసీ సభ్యులు పోలేబొయిన నర్సయ్య యాదవ్, గవ్వా కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.