నీట్ పరీక్ష ఫలితాలలో ఎంబిబిఎస్ సీటు సాధించిన కప్పగంటి మానస

మెడిసిన్ కళాశాలలో సీట్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బోయలగూడెం గ్రామస్తులు....
జోగులాంబ గద్వాల 20 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నీట్ పరీక్ష ఫలితాలలో గద్వాల నియోజకవర్గం గట్టు మండలం బోయలగూడెం గ్రామానికి చెందిన కప్పగంటి నర్సింహులు కూతురు కప్పగంటి మానస ప్రభుత్వ BC కోటాలో మంచి ర్యాంకు సాధించి నిర్మల్ జిల్లా లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది....
ఈ సందర్భంగా విద్యార్థిని మానస మాట్లాడుతూ....
తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని కష్టపడి చదివి ఈ విధంగా మెడిసిన్ లో సీటు రావడం పట్ల ఆనందంగా ఉందని అన్నారు.భవిష్యత్తులో పేద ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యమని అన్నారు... అదేవిధంగా, బోయలగూడెం గ్రామ నుంచి మెడిసిన్ లో ఎంబిబీఎస్ సీట్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి,అభినందించారు.....