జోగులాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కి ఆహ్వానం

శాలువాతో సత్కరించి అమ్మవారి పట్టు వస్త్రాలు లడ్డు ప్రసాదం అందజేత
ఆహ్వాన పత్రిక అందచేసిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ S.A. సంపత్ కుమార్.
జోగులాంబ గద్వాల 20 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజా నర్సింహ కి ఈ నెల లో శ్రీ శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారి దేవస్థానం జరగబోయే శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్. ,దేవాలయం కమిటీ చైర్మెన్ నాగేశ్వర్ రెడ్డి , దేవాలయ EO దీప్తి , దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి ఆహ్వానం పలికారు .