ఏం ఎల్ ఎచ్ పి వైద్యులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు.
జోగులాంబ గద్వాల7 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద పల్లె దవాఖానాల్లో మిడిల్ ప్రొవైడ్ డ్డాక్టర్లు గా పనిచేస్తున్న ఏం ఎల్ ఎచ్ పి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత ఈ ఎస్ఐ, పిఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ఏఐటియుసి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు డిమాండ్ చేశారు . జోగులాంబ గద్వాల జిల్లా ఏ ఐ టి యు సి కార్యాలయంలో జరిగిన వారి జాబా చాట్ ప్రకారం మాత్రమే డ్యూటీలు కేటాయించాలని అదనపు పనులు కేటాయించరదని పేర్కొన్నారుఏం ఎల్ ఎచ్ పి వైద్యులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
-ఏ ఐ టి యు సీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద పల్లె దవాఖానాల్లో మిడిల్ ప్రొవైడ్ డ్డాక్టర్లు గా పనిచేస్తున్న ఏం ఎల్ ఎచ్ పి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత ఈ ఎస్ఐ, పిఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ఏఐటియుసి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఏ ఐ టి యు సి జిల్లా కార్యాలయంలో జరిగిన ఏం ఎల్ ఎచ్ పి ఉద్యోగుల సమావేశంలో ముఖ్య అతిథిగా బి ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు .ఈసందర్భంగా ఏం ఎల్ ఎచ్ పి డాక్టర్లకు జాబా చాట్ ప్రకారం మాత్రమే డ్యూటీలు కేటాయించాలని అదనపు డ్యూటీలు కేటాయించరాదని పేర్కొన్నారు.
పల్లె దవాఖానలో ఓపి చూసే వైద్యులుగా నియమించుకుని 12రకాల వైద్య సేవాలతో పాటు 14రకాల కేంద్ర ప్రభుత్వ విధులను కూడా విరితో చేయిస్తున్నకూడా ఇతర ఉద్యోగులతో సమాన జీతాలు ఇవ్వడంలేదన్నారు. ఇక్కడ కూడా శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు .సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన అమలు చేయడం లేదన్నారు. పల్లె దవాఖనలతో పాటు ఇతర పనులు చేసినా 29వేలె జీతం ఇస్తున్నారన్నారనీ వీరికి వెంటనే 45 వేల రూపాయల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికే హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించకపోతే ప్రజారోగ్యం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. ఎం ఎల్ హెచ్ పి మిడిల్ ప్రొవైడ్ డాక్టర్లుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఎక్కడ ఏ గ్రామాలకు పంపిన వెళ్లి వైద్య సౌకర్యాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు వీరికి పని చేసే చోట ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడం సరైనది కాదని తెలిపారు. మారుమూల గ్రామాల్లో పేద ప్రజలకు అనేక సేవలందిస్తున్న ఇలాంటి ఎమ్మెల్ హెచ్ పి మిడ్ ప్రొవైడ్ డాక్టర్లను ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కన్వీనర్ గా శివతేజ, కో కన్వీనర్లుగా రేణుక, నందకుమార్, హేమావతిని ఎన్నుకోగా అడ్వైజర్స్ గా సుజాత, శివకుమార్, రోజలీలను. సభ్యులుగా అజిత్ కుమార్ వెంకటేశ్వరి శ్వేత శిరీష శైలజ శిరీష ప్రేమలతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.