నల్లగొండ సభ" రాజకీయాల కోసం కాకపోతే రాజకీయాల ప్రస్తావన ఎందుకు?

Mar 9, 2024 - 23:03
Mar 10, 2024 - 02:02
 0  4

దద్దమ్మల పాలన అంటూ కాంగ్రెస్ను నిందించడం  ఓటమితో రెచ్చిపోవడమే.  కృష్ణా నీళ్ల కోసం హక్కుల సభ అంటూ  అసెంబ్లీకి రాకపోవడంలో  ఔచిత్యం ఏమిటి?  రాజకీయాల్లో  నోటి దురుసుతనం  గత ప్రభుత్వ  పాపమే.* విజ్ఞతతో ప్రతిపక్ష పాత్ర పోషించడo తప్ప గత్యంతరం లేదు సుమా!
---వడ్డేపల్లి మల్లేశం 
---13...02...2024
రాజకీయాలలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా కెసిఆర్ పాలనలో ప్రారంభమైనది.  కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వ పెద్దలతో పార్టీ  బాధ్యులతో  అసభ్యంగా మాట్లాడి  నయవంచనకు గురైన పార్టీ బారాస.  అందుకు ప్రతిగా బిజెపితో పాటు కాంగ్రెస్ ఇతర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరిని మించి మరొకరు  అదే భాషను మాట్లాడి  విజ్ఞత గల రాజకీయాలకు ద్రోహం తలపెట్టడం జరిగింది.  దాని పర్యవసానమే కేంద్ర మంత్రిని రండ అని బారాసావాళ్లు అంటే  బారాస వాళ్ళ బెదిరింపులు అక్రమ  అరాచక వాదాలకు ప్రతిగా ముఖ్యమంత్రి  కెసిఆర్ ను రండ అనక చెప్పలేదు. అంటే  రాజకీయాలు ఎంత బ్రష్టు పట్టిపోయినాయో అర్థం చేసుకోవచ్చు.  ఈ క్రమం ఇంతటితో ఆగలేదు మాజీ ఎమ్మెల్యే ఎంపీ  ఇటీవల అనేక ఆరోపణలకు గురై ఓటమిపాలైన  బాల్క సుమన్  ఒక సభలో ముఖ్యమంత్రి పైకి చెప్పులు లేపి  చెప్పుతో కొడతా అని మాట్లాడం తారాస్థాయికి చేరుకున్నది. అయినా ఆ పార్టీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం  ఆ పార్టీ  దురుసుతనానికి  అసభ్యత అనాగరిక తకు నిదర్శనం కాదా? . ఇదే కోవలో  బుధవారం జరిగిన చలో నల్లగొండ సభలో  మాట్లాడిన బారాసా అధినేత  కాంగ్రెస్ పరిపాలనను "దద్దమ్మల పాలన" అని  దుర్భాషలాడుతూనే నన్ను నిందిస్తే ఏమొస్తుంది అని మాట్లాడడం  ఆత్మవంచనే అవుతుంది.

చలో నల్లగొండలోని  కీలక అంశాలు:-

 కృష్ణా జలాలకు సంబంధించి  కీలక అంశాలపై మాట్లాదాలంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావలసిన బదులు  బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని  మాట్లాడడం అంటే బాధ్యతను విస్మరించడమే.  కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని  అసెంబ్లీలో తీర్మానం చేస్తున్న తరుణంలో కూడా  ప్రతిపక్ష నేత కేసిఆర్ సభకు రాకపోవడం   కర్తవ్యాన్ని విస్మరించి  సభను ప్రజలను సబ్జెక్టును పక్కదారి పట్టించడమే అవుతుంది.  ఇక నల్లగొండ సభ రాజకీయాల కోసం కాదంటూ " నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతున్నది" అని కెసిఆర్ లే నిపోని ఆరోపణలు 
  ప్రజలను తప్పుదారి పట్టించడమే.  ప్రజలు ప్రజాస్వామి కవాదులు  బారాస ప్రభుత్వ తప్పిదాలను  ప్రస్తుతం చేస్తున్న అరాచక అక్రమ విధానాలను బెదిరింపులు  బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా గమనిస్తున్నారని  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి రూపంలో చవి చూడవలసి ఉంటుంది అని గుర్తిస్తే మంచిది.  "కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులు పైనే మమకారమని పాలిచ్చే బర్రె లాంటి బారాసాను ఓడించి  దున్నపోతు వంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చు కున్నారని కెసిఆర్ వ్యా ఖ్యానించడం  తనను తాను సమర్థించుకోవడమే ,  ఓటమిని అంగీకరించకపోగా అహంకారపూరితంగా వ్యవహరించడమే అవుతుంది . మేడిగడ్డ ప్రాజెక్టు లోని అవినీతి   పిల్లర్ల కు0 గుబాటు  గురించి ప్రస్తావించిన ప్రతిసారి  వందల పిల్లర్లలో ఒకటి రెండు దెబ్బతింటే రిపేర్ చేయాలి కానీ  మూసి మూసుకు పోలేదా? నాగార్జునసాగర్ కుంగలేదా? పొరపాటు జరుగుతే తప్పేంటి అని సమర్థించుకోవడం చేసిన నేరాన్ని అంగీకరించడమే అవుతుంది . కృష్ణా జలాల   హక్కులకు సంబంధించిన  సమస్య పైన  కాంగ్రెస్ brs పరస్పరం విమర్శించుకోవడం కాకుండా నిపుణుల సమక్షంలో  పూర్వాపరాలు, గత ఒప్పందాలు, అంగీకరించిన విషయాల పైన  నిగ్గు తేల్చుకోవడం చాలా అవసరం.  అధికారం కోల్పోయి రెండు నెలలు కాకముందే " అధికారం ఎవరికి శాశ్వతం కాదని  రెట్టింపు వేగంతో మళ్ళీ అధికారంలోకి వస్తామని " బారాస అధినేత కేసీఆర్ అంటే గతంలో ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని కూ లదొస్తామని  బారాస నాయకులు ప్రకటించడం  పదవి, అవినీతి,  అక్రమార్జనకు ఏ రకంగా తెగబడింది అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ముఖ్యమంత్రి  పీసీసీ అధ్యక్షులు హోదాలో కేసీఆర్ను లక్ష కోట్ల అవినీతికి  పాల్పడినాడని విమర్శించినప్పుడు కనీసం కూడా స్పందించకపోవడం అంటే నేరాన్ని అంగీకరించడమేనా?  "కాలు విరిగినా  కట్టబట్టుకొని నల్లగొండకు సభకు వచ్చినాను" అని  గొప్పలు చెప్పుకోవడం కాదు  హైదరాబాదులో ఉన్న అసెంబ్లీకి రాకపోవడం అంటేనే  చట్టసభలు ప్రజల పట్ల  బారాసాకు ఉన్న  చులకన భావం అర్థం అయిపోతున్నది.  గతంలో ఉన్నటువంటి సెక్రటేరియట్ కు ఏనాడు కూడా  వెళ్ళని నాటి ముఖ్యమంత్రి  అప్పనంగా భవనాన్ని కూల్చివేసి  కొత్త భవనం కట్టే లోపే అధికారం కోల్పోవడం అంటే  చట్టసభలు  ప్రజా భవనాలను  ఖాతరు చేయకపోవడమే అని అర్థమవుతున్నది . ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా  ప్రజా తీర్పును గౌరవించి  కట్టబెట్టిన ప్రతిపక్ష స్థానాన్ని పదిల పరుచుకొని ప్రజల విశ్వాసాన్ని పొందాలి.  ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, మానవ హక్కులను పౌర హక్కులను గౌరవిస్తామని,  నిర్బంధం అణచివేతను  తొలగిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని దద్దమ్మ పాలన అనడం  బారాస మానసిక స్థితిని  వైఫల్యాన్ని నేర ప్రవృత్తిని తెలియజేస్తున్నది.

తనను తాను అతిగా ఊహించుకోవడం  ఇబ్బెట్టుగా ఉంటుంది:-

నల్లగొండ సభలో  బారాస అధ్యక్షుడు కేసీఆర్  "నేను సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేను.  కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల కోసం పోరాడడానికి బొబ్బిలిలా వచ్చాను."  అంటూ మాట్లాడమంటే  తెలంగాణ తన సొంత   జాగీరుగా  ప్రకటిస్తే ఎవరు అంగీకరించరు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి  దశాబ్దాల చరిత్ర ఉంది  టిఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందు  50 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  అనేక ప్రజా సంఘాలు పార్టీలు విద్యార్థి సంఘాలు  పోరాటం చేసిన విషయాన్ని కెసిఆర్ అంగీకరిస్తే మంచిది . తెలంగాణ రాష్ట్ర అవశ్యకతకు సంబంధించిన భావజాలాన్ని ప్రజలలో నింపి చైతన్యంతో  ఉద్యమానికి  శ్రీకారం చుట్టిన ప్రజా సంఘాలు  పెట్టిన బిక్ష తెలంగాణ రాష్ట్రం. కానీ  తెలంగాణ తన వళ్లనే వచ్చింది అనడం  ఎవరు అంగీకరించరు . తెలంగాణ కోసం 1200 పైగా  విద్యార్థులు యువత అమరులైతే  కనీసం వారి కుటుంబాలను గుర్తించనటువంటి బారాస  నేను సాధించిన అని కేసీఆర్ ప్రకటించడం  ఆత్మవంచనే అవుతుంది . కెసిఆర్ పరిపాల నుండి తప్పుకోగానే  కరెంటు పోతున్నది అని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడం  చట్ట సభలోను బయట దూకుడుగా వ్యవహరించడం  చట్ట వ్యతిరేకమే కాదు నేరం కూడా.  చట్టం తన పని తాను చేసుకోయే క్రమంలో  పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీ పైన  కఠినంగా వ్యవహరించాలి .అదే సందర్భంలో న్యాయ వ్యవస్థ కూడా  అహంకారం ఆధిపత్యపూరితమైన మాటలు  అనాగరిక అసభ్య పదజాలం వాడుతున్న బారాస నాయకుల  చేష్టలపై  సుమోటోగా చర్యలు చేపట్టవలసిన సమయం ఆసన్నమైనది.  ప్రభుత్వం  కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి  నాణ్యత లోపం పైన ఆందోళన చెంది  తగు చర్యలు తీసుకుంటూ ప్రతిపక్ష పార్టీని కూడా ఆహ్వానిస్తూ తమ సూచనలు  కోరుకుంటున్నా సందర్భంలో కనీసం స్పందించకపోగా  జరిగిన   పొరపాటును కేసీఆర్  అంగీకరించకపోవడం  విడ్డూరం. అంతే కాదు  "ప్రభుత్వం వెంట పడతాం వేటాడుతాం" అంటూ  ఆటవిక అనాగరిక భాష వినియోగిస్తున్న ప్రతిపక్ష బారాస పార్టీపై  ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలు  కఠినంగా వ్యవహరించాలి.  బారాస పార్టీ ప్రజా వ్యతిరేక ఆలోచనలను  ఎండగట్టే క్రమంలో  ఒంటరి చేయడమే ప్రస్తుతం ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం .అందులో  భాగంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో  ఓడించి  తమ తప్పును తెలుసుకునే విధంగా  ఓటమి అంచుకు తరిమికొట్టాలి.  తెగించి మాట్లాడడం,  ప్రభుత్వ పరువును బజారుకీర్చడం,  సక్రమ పాలనకు ముళ్ళు గు చ్చడం  తన గోతిని తానే తవ్వుకోడమే అవుతుంది . ఇది అహంకారం, ఆదిపత్యం  తప్ప మరొకటి కాదు .
      ఆనుత్పాదక రంగం పైన ఎక్కువగా ఖర్చు చేసి,  కాయిలా పడిన ప్రభుత్వ పరిశ్రమలను తెరిపించక  ప్రభుత్వ రంగాన్ని కూలదోసి, ప్రైవేటులో  విశ్వవిద్యాలయాలను ప్రారంభించి ప్రజలకు విద్యను దూరం చేయడంతో పాటు,  గుట్టలు ప్రకృతి విధ్వంసానికి తెరలేపి,  భూ కబ్జాలు, భూ దందాలు అక్రమార్జ నకు  జీవం పోసి,  ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి,  ప్రజాధనాన్ని కొల్లగొట్టి , భూస్వాములు సంపన్న వర్గాలకు దోచిపెట్టిన  మీ పరిపాలన గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది.  చేసిన తప్పులను దాచుకుంటే  ప్రజలు  మరిచిపోవడానికి సిద్ధంగా లేరు .మీ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రజల అసమ్మతి, మేధావుల చైతన్యం,  గాడి తప్పిన పాలన, అహంకారం,  అధికారం పట్ల మక్కువ ప్రధాన కారణాలని ఇప్పటికైనా గుర్తించి  విజ్ఞత ప్రదర్శించి  బాధ్యత గల ప్రతిపక్షంగా మసులుకోవడమే ప్రస్తుత కర్తవ్యం.... అంతకుమించి ప్రత్యామ్నాయము లేనేలేదు.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత  హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333