ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వాన్ని విజయవంతం చేయండి పేరాల శ్రీనివాస్

Mar 28, 2024 - 20:43
 0  3
ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వాన్ని విజయవంతం చేయండి పేరాల శ్రీనివాస్

తిరుమలగిరి 29 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

 ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రచార కమిటీ సభ్యులు మండల కోఆర్డినేటర్ పేరాల శ్రీనివాస్ మహారాజ్ పాల్గొని మొట్టమొదటి సభ్యత్వాన్ని బరపటి శ్రీనివాస్ మహారాజుకు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జన్మదిన ఉత్సవాలు, ధర్మసమాజ్ పార్టీ మొదటి ప్లీనరీ సమావేశాలు, ప్రతి గ్రామంలో నిర్వహించి, మండల కేంద్రంలో అధిక సంఖ్యలో నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏపూరి అవిలయ్య, గాజే సందీప్, హేమాండల ప్రశాంత్, బరపటి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034