రోగులను దోచుకుంటున్న ప్రయివేటు ల్యాబ్ లు డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి.సిపిఎం డిమాండ్
రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాధి నిర్దారణ పరీక్షల పేరుతో రోగులను దోచుకుంటున్న ప్రైవేటు ల్యాబ్ ల గుర్తింపు రద్దు చేసి రెఫర్ చేసే డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు శనివారం జిల్లా కేంద్రంలోని కలేక్టర్ కార్యాలయం అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యలేమీ దోమల కారణంగా ప్రజలు ఆసుపత్రుల పాలు అవుతున్నారని సిపిఎం బృందం గత 3 రోజులుగా పట్టణంలోని వివిధ ప్రధాన ఆసుపత్రులు ల్యాబ్ లు ఐన వెన్నెల బిందూ సాగర్ ఆదిత్య రాఘవేంద్ర సాయికృప విజయ భాస్కర్ రెడ్డి పెంచలయ్య స్రవంతి సెంట్రల్,SS,నిది,విజయ్ ఆపిల్ యువి smn ల్యాబ్ తదితర రోగ నిర్దారణ కేంద్రాలను ఆసుపత్రులను విజిట్ చేసి రోగులతో మాట్లాడిన సందర్భంగా తమ దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు డాక్టర్ రెఫర్ చేస్తేనే వ్యాధి నిర్దారణ చేయాలని కానీ ప్రైవేటు ల్యాబ్ లు సెల్ఫ్ పేరుతో రోగులు వెళితే నేరుగా పరీక్షలు చేసి పంపుతున్నారని తెలిపారు.ల్యాబ్ లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న టెక్నీషియన్ కాకుండా అతని మిత్రులు నేర్చుకోవడానికి వచ్చిన వారు ఎక్కువగా పరీక్షలు చేస్తున్నారని తెలిపారు,వ్యాధి నిర్దారణ పరీక్ష చేసిన తర్వాత యువి వంటి ల్యాబ్ లు కిట్ లను ఇవ్వటం లేదని కేవలం రిపోర్టు మాత్రమే ఇస్తున్నాయని తెలిపారు రోగ నిర్దారణ అనంతరం ఒక ల్యాబ్ కిట్లను అందజేస్తే మరొక ల్యాబ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఆసుపత్రులలోని డాక్టర్ లు డెంగీ లక్షణాల తో వస్తె ముందు ఎలిసా టెస్టు చేసి వ్యాధి నిర్దారణ ఐన తర్వాత డెంగ్యూ టెస్టు చేయాలని కానీ డాక్టర్లు నేరుగా డెంగ్యూ టెస్టు చేయిస్తున్నారని తెలిపారు రోగికి అవసరం ఉన్న లేకున్నా అన్ని రకాల పరీక్షలను చేస్తూ రోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు జిల్లా వైద్య అధికారులు లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రతి ల్యాబ్ లో ఏ పరీక్షకు ఎంత ధరో ధరల సూచిక ఏర్పాటు చేయాలని కానీ మెజారిటీ ల్యాబ్ లు ఈ విధానాన్ని అమలు పరచడం లేదన్నారు వ్యాధి నిర్దారణ పరీక్షల అనంతరం రోగులకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు కేవలం రిపోర్టు లు మాత్రమే ఇస్తున్నారని మిగతా వారికి అడిగితే తప్ప బిల్లులు అసలు ఇవ్వడం లేదన్నారు,నిరక్ష్యరాసులకు అసలు బిల్లులు ఇవ్వడం లేదన్నారు డెంగ్యూ టెస్టు కిట్ కేవలం 150-200 మాత్రమే పడుతుందని ప్రైవేటు వారు మాత్రం 1200-1500 వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు వ్యాధి నిర్దారణ చేసే యంత్రాల సామర్థ్యం పై కూడా జిల్లా వైద్య అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వ్యాధి నిర్ధారణ చేసే యంత్రం నైపుణ్యత ఆధారంగా ధరలను నిర్ణయించాలని కానీ ఇష్టారితిలో ఫీజులను వసూలు చేస్తున్నారని విమర్శించారు.వ్యాధి నిర్దారణ అనంతరం నివేదిక పై MD పైతాలజిస్ట్ సంతకం చేయాలని కానీ అమలు కావడం లేదన్నారు ల్యాబ్ టెక్నీషియన్ నే సంతకం చేస్తున్నారని ధ్వజమెత్తారు జిల్లాలో వైద్య విధాన పరిషత్ లో జిల్లా వ్యాప్తంగా 132 ల్యాబ్ లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని మరి గ్రామాలలో సైతం పుట్ట గొడుగులలాగా పుట్టుకొచ్చిన ప్రైవేటు ల్యాబ్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కొంత మంది డాక్టర్ లు తమ లాభాపేక్ష కోసం రోగులను డయాగ్నోస్టిక్ సెంటర్ లకు పంపి వారిని నిలువు దోపిడి చేస్తున్నారని విమర్శించారు రోగి బంధువులు లేదా స్నేహితుల ల్యాబ్ ల వద్ద వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తే డాక్టర్లు ఒప్పుకోవడం లేదని కచ్చితంగా తాము రేఫర్ చేసిన డయాగ్నోస్టిక్స్ సెంటర్లోనే పరీక్షలు చేయించుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లావ్యాప్తంగా ఏ ఏ ల్యాబ్ లో ఎన్ని డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి అనే సమాచారం జిల్లా వైద్యాధికారులు అడగకపోవడం వల్ల ప్రైవేటు ల్యాబ్లు కూడా అందించడం లేదని దీని వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులపై సమగ్రంగా ప్రభుత్వానికి అందించకపోవడం వల్ల ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడం కూడా కష్టమవుతున్నదని తెలిపారు.కావున తక్షణమే జిల్లా వైద్య అధికార యంత్రాంగం ప్రైవేటు ఆసుపత్రులు ల్యాబ్ లను సందర్శించి గుర్తింపు లేని ప్రైవేట్ ల్యాబ్ లను రద్దుచేసి, ప్రతి ల్యాబ్ లో ధరల పట్టిక ఏర్పాటు చేసే విధంగా అందులో md పథలజిస్ట్ ఉండే విధంగా వ్యాధి నిర్ధారణ యంత్రం నైపుణ్యత ఆధారంగా ధరలు నిర్ణయించే విధంగా ప్రతి పరీక్షకు బిల్లులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షాన ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు s రాజు డి శివకృష్ణ వీరేష్ ఆంజనేయులు బలరాం శివ తదితరులు పాల్గొన్నారు...