దర్మాపురం గ్రామంలో మరణించిన గ్రామ సిబ్బంది మృతదేహం వద్ద

సంతాపం ఎంపీడీవో వెంకటేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సాయం

Aug 14, 2024 - 18:55
Aug 15, 2024 - 07:41
 0  19
దర్మాపురం గ్రామంలో మరణించిన గ్రామ సిబ్బంది మృతదేహం వద్ద

దర్మాపురం గ్రామంలో మరణించిన గ్రామ సిబ్బంది మృతదేహం వద్ద

సంతాపం ఎంపీడీవో వెంకటేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సాయం 

 పెన్ పహాడ్, 15 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  పెన్ పహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలో క్రిమిసహారిక మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న గ్రామపంచాయతీ వర్కర్ నెమ్మది వెంకన్న అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు బుధవారం ఎంపీడీవో వెంకటేశ్వరరావు నగదు 20వేల రూపాయలు అందజేశారు. మృతదేహంపై పుష్ప ఉంచి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మృతునికి సంతాపం తెలిపిన వారిలో ఎంపీ ఓ. సంజీవ. పంచాయతీ కార్యదర్శి షేక్ మునీర్. గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీనివాస్. మాజీ ఎంపిటిసి నెమ్మది లక్ష్మమ్మ. జిపి వర్కర్లు విజయ్ లక్ష్మయ్య గురువయ్య గోపాల్ లు ఉన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State